#


Index

   అక్షరం బ్రహ్మ సమ్మితం. బ్రహ్మతత్త్వంతో కూడిన అక్షరానివి నీవు. నీకూ బ్రహ్మానికీ భేదం లేదు. నీవూ అక్షరమే. అదీ అక్షరమే. క్షరం కాని దేదో అది అక్షరం. అలాటి అక్షరమైన తత్త్వాన్ని అందించే తదాకారమైన వృత్తివి కాబట్టి నీవూ అక్షరమే. తాదర్యా త్తద్వ్యపదేశః అన్నారు. ఆయుర్వైఘృతం. నెయ్యి ఆయుస్సేనంటే ఆయుర్వర్ధకమని అర్థం. గాయత్రి బ్రహ్మమేనంటే బ్రహ్మతత్త్వాన్ని అనుభవానికి తెచ్చేదని భావం. గాయత్రీ ఛందసాంమా తేదం బ్రహ్మజుషస్వమే. ఛందస్సులంటే వేదాలు. వేదాలకు తల్లి గాయత్రి. ఓంకారమే గదా గాయత్రి - ఓంకారంలో నుంచే వేదాలున్న జన్మించాయి. శబ్ద వికారం వేదమంటే. అది శబ్ద సామాన్యమైన ఓంకార వివర్తమే. కనుక గాయత్రి వాటికి మాతృస్థానం. అందుకే ఛందస్సారా అని నామం అమ్మ వారికి. ఇదం బ్రహ్మ ఇదుగో నేను కూడా ఈ బ్రహ్మ కర్మ చేస్తున్నాను. ఈ కర్మ ద్వారా బ్రహ్మ సాయుజ్యమే కోరుతున్నాను. జుషస్వమే. ఇందులో వచ్చి కూచో తల్లీ. మంచిదే కాని నీ మనస్సు శుద్ధి అయితే గదా అంటావేమో.

యదహ్నాత్కురుతే పాపం - తదహ్నాత్ప్రృతి ముచ్యతే.
యద్రాత్రియాత్కురుతే పాపం తద్రాత్రియాత్ప్రతి ముచ్యతే.

   పగటి వేళ నేనే యే దుష్కార్యాలు చేసినా వాటి కాలుష్యం పగటి తోనే తీరిపోతుంది. రాత్రి వేళ ఏవేవి చేస్తే వాటి కల్మషం రాత్రితోనే తీరిపోతుంది. నేను బ్రహ్మ భావనతో ఈ కర్మ చేస్తున్నాను కాబట్టి.

Page 71