#


Back

   దీనికి దేవత అగ్ని. అగ్ని అంటే ఆ దివ్యమైన తేజస్సే. బ్రహ్మ ఇత్యార్షమ్. ఋషికి సంబంధించినది ఆర్షం. అది బ్రహ్మమే. అంటే అర్ధం. బ్రహ్మమే తన్ను తాను దర్శిస్తున్నాడు. అలాగే దాన్ని తన స్వరూపంగానే దర్శిస్తున్నాడు. విశ్వామిత్రుడి లాంటి ఒక మహర్షి. బ్రహ్మం దర్శించినట్టే బ్రహ్మమై ఎవడు దర్శిస్తాడో ఇద్దరూ ఒకటే. ఇద్దరికీ భేదం లేదు గనుక బ్రహ్మానికి బ్రహ్మమే ఋషి. గాయత్రం ఛందః దేవత అయింది. ఋషి అయింది. ఇక ఛందస్సు. అది ఏదో గాదు గాయత్రే. ఏమిటర్ధం. గాయత్రీ అనేది ఒక దేవత అని గాదు. సప్త చ్ఛందస్సులలో అది ఒక ఛందస్సు. అనుష్టుప్ త్రిష్టుప్ జగతీ ఇలాంటివి ఏడున్నాయి ఛందస్సులు. ఛాదనం చేసే దేదో అది ఛందస్సు. లోపలి మంత్రార్ధ మన ధికారుల కెవరికీ తెలియకుండా కప్పిపుచ్చే అక్షర విన్యాసమే ఛందస్సంటే. మంత్రార్ధం మంత్రాధి దేవత పరాశక్తే. దానికొక ఆచ్చాదన ఈ ఛందస్సు. దీన్నే శ్లోకమని వృత్తమని పద్యమని కూడా పేర్కొనవచ్చు. ఈ శబ్ద రూపమైన గాయత్రీ ఛందస్సుకు అర్ధరూపమైన శక్తికీ అభేదాన్ని కల్పించి గాయత్రి అంటే పరమాత్మ శక్తి అన్నారు పెద్దలు. అంత మాత్రమే.

  పరమాత్మా స్వరూపం - సాయుజ్యే వినియోగః -

   పోతే దీని స్వరూపమేమిటని అడిగితే అది పరమాత్మేనట. శబ్ద రూపంగా వ్యక్తమవుతున్నది శక్తి అయితే శక్తిరూపంగా వ్యాపిస్తున్నదా పరమాత్మే గదా.

Page 68