#


Index

   గృహంలో అతిధిగా వచ్చి కూచున్నదీ అదే. అంటే గార్హపత్యాగ్ని అని భావం. నృషద్ నరులం దరిలో ఉన్న జఠరాగ్ని వైశ్వానరాగ్ని కూడా అదే. అహం వైశ్వానరో భూత్వా అని గదా గీతా వాక్యం. వరసద్. వరమంటే ప్రశస్తమైనది. ప్రశస్తమైన పదార్థాలన్నిటిలో ఉన్నదదే. బుత సత్ ఋతమంటే సత్యం. అస్తిత్వంతో కూడిన పదార్ధాలన్నీ సత్యమే. వాటన్నిటిలో సత్తా రూపంగా ఉన్నదదే. వ్యోమసత్ - ఆకాశంలో ఉన్నదదే. అబ్జా - జలంలో ఉన్నదదే - గోజా భూమిలో ఉన్నదీ అదే. ఋతజా. ఋతంలో నుంచి జన్మించిందీ అదే. అద్రిజా. పర్వతాలలో ఉన్నదీ అదే. ఇంతెందుకు. ఋతం బృహత్.

   ఆ పరమ సత్యమే దైతే ఉన్నదో అదే ఇన్ని రూపాలలో మనకు ప్రత్యక్షమవుతున్నది. అది ఉంటే సత్యం. కనపడితే బుతం. ఋ అనే ధాతువుకు దర్శనమని అర్థం. ఋషి అంటే దర్శించేవాడు. అప్పటి కున్నదీ అదే కనిపిస్తున్నదీ అదే. ఆ చైతన్య ప్రకాశమే. ఉంటే అది నిర్గుణం. కనిపిస్తే సగుణం. అంటే భౌతికంగా అభౌతికంగా వ్యక్తంగా అవ్యక్తంగా ఉన్న దొకే ఒక చైతన్య ప్రకాశమదే ఈ తేజో బన్నాత్మకమైన చరా చర ప్రపంచమని దాని సర్వతో వ్యాప్తమైన స్వరూపాన్ని భావన చేస్తూ పోవాలి మనం.

Page 65