#


Back

   ఆపశ్శుంధంతుమా ఏనసః - ఎలా అవుతాము శుద్ధి. ఏనస్సంటే పాపం. పాపకర్మ మాలిన్యం నుంచి అబ్దే వతలు మీరు మమ్ము శుద్ధి చేస్తే అవుతామని భావన. మానసికంగా వాచికంగా కాయికంగా త్రికరణ శుద్ధిగా కావాలి అది. అలాటి పవిత్రతను భావన చేయాలి సాధకుడు. ఇలా భావన చేసి మరలా కేశవ నామాలు జపించి మూడు మార్లు మరలా ఆచమనం చేసి పరిశుద్ధుడయిన తరువాత గాయత్రి నుపాసన చేస్తూ అర్థ్యాన్ని సమర్పిస్తున్నాడు సాధకుడు. చేతులు శుద్ధి చేసుకొని అర్పించేది అర్ఘ్యం. పాదాలు శుద్ధి చేసుకొంటే అది పాద్యం. రెండూ జలంతోనే శుద్ధి కావాలి. జలంతో చేతులు కడుగుకొని ఆపోశనం చేయాలి. ఆపః అంటే జలం. అశన మంటే త్రాగటం. ఇదీ ఆపోశన మంటే. ఇదే అవపోసర మయింది లోక వ్యవహరంలో. సంక్రాంతి సంకురాత్రి అయినట్టు. అక్షత లక్షింతలయినట్టు. ఇది అర్ఘ్య ప్రదానానికి ముందు చేసే పూర్వాపోశనం. తరువాత చేస్తే ఉత్తరాపోశనం. అర్ఘ్య ప్రదాన సంకల్పం చెబుతున్నాడిప్పుడు.

పూర్వక్షైవం గుణ విశిష్టే శుభే ముహూర్తే - మమోపాత్త దురిత క్షయ ద్వారా శ్రీపరమేశ్వర ముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధ

   మని పేర్కొనటమే సంకల్పం చెప్పుకోటం. అలా చెప్పుకొని మూడు సంధ్యలలో ఏ సంధ్య అయితే దాన్ని స్మరిస్తూ అర్ఘ్య ప్రధానం కరిష్యే అని సమర్పించాలి సూర్య భగవానుడి కర్ష్యం.

Page 63