పంచీకరణ న్యాయాన్ని బట్టి ఒకదానిలో మరొకటి గుప్తంగా ఉంటూనే ఉంటాయి. అప్సుషదః అంటే నీళ్లలోనే ఉన్నవని అర్ధం. హువేవః - అదంతా మీకు అప్పజెబుతాము మేము. ఎందుకని. మాకు కావలసిన దగ్ని కాదు. జలం కాదు. భౌతికమైన వాటి రూపాలు కాదు మాకు కావలసినది. మరేమిటి. మయి వర్చో బల మోజో నిధత్త. వాటివల్ల కలిగే ఫలమేదో అది మాకు ప్రసాదించండి. ఏమిటా ఫలమంటే చెబుతున్నాడు. వర్చః అంటే ముఖంలో కొట్ట వచ్చినట్టు కనిపించే వర్ణం. కళ. బలం. బలమంటే శారీరకమైన సామర్ధ్యం. ఓజః ఓజస్సంటే శరీరం లోపల ఉన్న సారం. మయి నిధత్త. వీటన్నిటినీ మాలో ప్రవేశపెట్టండి.
ఎందుకు. దాని ప్రయోజనమేమిటి. చెబుతున్నాడు. ద్రుపదా దివ ముంచతు. ద్రుపద మంటే బండ కొయ్య. పూర్వం బండ కొయ్య వేసే వారట అల్లరి పిల్లలను. అలాగే బండ కొయ్య వేసింది ప్రకృతి మనల నందరినీ. అదే ఈ సంసారం. ముంచతు. దీనిలో నుంచి మమ్ము తప్పించు. తప్పించుకొనే స్తోమత ఇవ్వండి మాకు దేవతలారా. ఉన్ముముచానః తప్పించుకొని బయటపడితే సాధన మార్గంలో ముందుకు సాగిపోగలం. స్విన్నః స్నాత్వీ మలాదివ. బాగా చెమట పట్టిన వాడు స్నానం చేసి శరీర మాలిన్యాన్ని పోగొట్టు కొన్నట్టు. పూతం పవిత్రేణేవ ఆజ్యం. దర్భ పుల్ల ముంచితే ఆజ్యం పవిత్ర మయినట్టు మేము పరిశుద్ధులం కావాలి మొదట.
Page 62