అంతరిక్షానికి దిగి వచ్చే సరికి మేఘ మండల రూపంగా తయారవుతాయి. అప్పుడు కనపడుతుంది కొంత. యాః పృధివీం పయ సోందంతి భూలోకం దగ్గరికి వచ్చాయంటే వర్షధారలుగా మారి భూమిని తడుపుతూ పోతాయి. శుక్రాః శుభ్రమైన ఆపః ఆ జలమే మాకు ఆహారాన్ని ప్రసాదించి సుఖప్రద మగుగాక.
అంతే కాదు. శివేన మా చక్షుషా పశ్యత ఆపః ఓ జల దేవత లారా మమ్ము మీరు శుభకరమైన దృష్టితో చూడండి. శివయా తనువా ఉపస్పృశత త్వచం మే - శుభమైన మీ శరీరంతో మా శరీరరాలను స్పృశించండి. అంటే మా చూపు మా స్పర్శ - ఇంద్రియాలన్నీ మీ వల్ల శివమయమై పోవాలి. ఎప్పుడూ బ్రతికి ఉండాలి. పనిచేస్తుండాలి. శివకరమైన మీతో సంసర్గముంటే గాని ఇవి శివమయం కాలేవు. ఇక్కడ దేవతలు మన ఇంద్రియాలే. ఆధ్యాత్మికంగా ఇంద్రియాలైతే ఆధి దైవికంగా దేవతలు. దేవతలక్కడ సూక్ష్మమైన జలాన్నే అమృత మని ఆశ్రయిస్తే మానవులిక్కడ స్థూలమైన ఆ జలాన్నే అన్నపానాదుల రూపంగా సేవించి అమృతమైన శక్తి రూపంగా అది మారితే దాన్ని ఆశ్రయించి బ్రతుకుతున్నారు. సర్వాగ్ం అగ్నీగ్ం రప్సు షదః - జలంలోనే ఉంటాయగ్నులన్నీ. విద్యుచ్ఛక్తి అదే గదా. బడబాగ్ని సాగరంలో ఉన్నదంటే కూడా అదే. అగ్నిలో నుంచి జలం వస్తే మళ్లీ జలంలో నుంచి అగ్ని.
Page 61