#


Back

   పంచభూతాలకు జలమొక ఉపలక్షణం Representative. ఆపః అని అందుకే అన్నారు. వ్యాపించే వని అర్థమసలు. అప్పటికేమయింది. మనసూ ప్రాణమూ జీవుడూ మూడు వచ్చాయిప్పుడు. ఇందులో జీవుడు ప్రధానుడు. వాడికి మనః ప్రాణాలు రెండూ ఉపాధులు. ఇవి రెండూ దగ్గర పెట్టుకొన్న జీవుడనైన నేను కూడా మీలో నుంచే వచ్చానండీ అని మొరపెడుతున్నాడు సాధకుడు. విరూపాః - మీరే వివిధ రూపాలలో అంటే తేజోబన్న రూపాలుగా ప్రసరిస్తున్నారు. కాబట్టి తాన ఆపః శగ్ం స్యోనా భవంతు - అలాంటి వ్యాపన శీలురైన మీరు మాకు నిత్యమూ సుఖాన్ని వర్షించండి. ప్రసాదించండి. మాకు సుఖపరమైన దేదో దాన్ని చూపండి. మీలో నుంచే గదా మేము వచ్చాము మీరే మాకు ఆలంబనం.

   యాసాగ్ం రాజా వరుణః జలానికధి దేవత వరుణుడు. వరుణ అంటే అసలు వర్షించే స్వభావమున్న వాడని అక్షరార్థం. తేజస్సు కధి పతి సూర్యుడైతే జలానికి వరుణుడైతే పృధ్వికి అగ్ని. వీరు ముగ్గురి చుట్టే తిరుగుతుంటుంది. సంధ్యా వందన మంత్ర మెప్పుడూ కూడా. వసు రుద్రాదిత్యులు వీరే. వసువు పృధ్వికి - రుద్రుడంత రిక్షానికి - ఆదిత్యుడు ఆకాశానికి. ఛాందోగ్యం వీటినే తేజోబన్నాలని వర్ణించింది. ఇవి మూడూ మనకు కనిపించే ప్రత్యక్ష దైవతాలు. మధ్యే యాతి వరుణః అందుకే మధ్యలో అంటే అంతరిక్షంలో వెళ్లిపోతున్నాడట వరుణుడు.

Page 59