తేజస్సు నుంచే జన్మించారు మీరు. తేజో బన్నాత్మకం గదా సృష్టి. శుచయః అందుకే పరిశుద్ధులు మీరు. పావకాః - మీరే గాక మిమ్మాశ్రయించిన మమ్ములను కూడా పవిత్రులను చేయగలరు. పాపక శబ్దం చూచారా అగ్నికే గాక జలానికి కూడా వర్తిస్తున్నది. అగ్ని జలమూ ఇవి రెండే పావనమైనవి పావనం చేసేవి అని ఇంతకు ముందే పేర్కొన్నాము. దానికి తగినట్టే ఉన్నదీ ప్రయోగం. యాసు జాతః ఏ జలాల్లో నుంచి జన్మించాడో. ఎవడు. కశ్యపః - కశ్యపుడనే ప్రజాపతి. ఎలా అర్థం చేసుకోవాలిది. కశ్యప అంటే పశ్యక. వర్ణ వ్యత్యయ మేర్పడి కశ్యప అయింది. అన్నిటినీ చూచేవాడని అర్థం. అటు సూర్యుడు చూస్తున్నాడు. ఇటు మానవుడి బుద్ధి చూస్తున్నది. సూర్యుడంటే బుద్ధికి సంకేతం. ఆధిదైవిక మొకటి ఆధ్యాత్మిక మొకటి. ఇవి రెండూ పంచభూతాల కలయిక వల్ల ఏర్పడ్డ పాధులే. యాసుజాతః అంటే అదీ అర్థం.
పోతే యాస్వింద్రః - ఇదం ద్ర - ఇది చూసేదేదో అది ఇదంద్ర. ఇదం ద్రే ఇంద్ర. ఇది అంటే శరీరం. దీన్ని చూడటమంటే ఈ శరీరాన్ని అంటి పెట్టుకొని ఉన్న జీవుడు. వాడు సమష్టి రూపుడైనా కావచ్చు. వ్యష్టి రూపుడైనా కావచ్చు. వీడూ పాంచభౌతికమైన ఉపాధితో కలిసి ఏకమైన వాడే. అగ్నిం యా గర్భం దధిరే. అగ్ని అంటే ప్రాణం. దాన్ని గర్భంలో ధరించి ఉన్నాయి. ఏమిటి. ఆపః జలం. ఒక్క జలమనే కాదు.
Page 58