#


Back

   దీని ద్వారా దానినందు కోవాలని మా ఆకాంక్ష అంటారు మహర్షులు. అలాటి ఆకాంక్షే సాధకులమైన మనకూ ఉండాలి. మనకా ఆకాంక్ష రేకెత్తించటానికే పర్జన్య రూపం ధరించి సాక్షాత్తూ ఆ పరమాత్మ జలరూపంగా దివి నుంచి భువి దాకా అవతరిస్తున్నాడు. ఎలాగంటే వర్ణిస్తున్నదీ మంత్రం.

హిరణ్యవర్ణాశ్శుచయః పావకా యాసుజాతః కశ్యపో - యా స్వింద్రః అగ్నిమ్ యాగర్భం దధిరే విరూపాస్తాన ఆపః శగ్ం స్యోనా భవంతు యాసాగ్ం రాజా వరుణోయాతి మధ్యే సత్యానృతే అవపశ్యన్ జనావాం - మధు శుభ్రత శ్శుచయో యాః పావకా స్తాన ఆపశ్శగ్ం స్యోనా భవంతు - యాసాం దేవా దివి కృణ్వంతి భక్షం - యా అంతరిక్షే బహుథా భవంతి యాః పృథివీం పయ సోందంతి - శుక్రాస్తాన ఆపశ్శగ్ంస్యోనా భవంతు - శివేన మా చక్షుషా పశ్యతాపః శివయాతను వోప స్పృశత త్వచం మే - సర్వాగం అగ్నీగం - రప్సుషదో - హువే వో-మయివర్బో బలమోజో నిధత్త ద్రుపవా దివముంచతు - ద్రుపదా దివో మ్ముముచానః - స్విన్నః స్నాత్వీ మలాదివ పూతం పవిత్రేణే వాజ్యం- ఆపశ్శుంధంతు మైనసః -

   ఇదీ మంత్రం. ఆపోహి - ఓ జలాధి దేవతలారా - అని సంబోధన. హిరణ్యవర్ణాః శుచయః - పావకాః - బంగారం లాంటి తేజస్సు మీది.

Page 57