క్రాష్ట్రః అలాటి బలవంతుడూ జిష్ణోః జయశాలి అయినవాడూ అశ్వస్య వాజినః సర్వత్రా వ్యాపించే వేగవంతుడూ అయిన ఆ పరమాత్మకు నేను వందనం చేస్తే సురభినో ముఖాకరత్ అది మా ముఖాలను సువాసనా భరితం చేయు గాక. వాక్శుద్ధి కలిగించు గాక. ముఖంతో ఏది ఉచ్ఛరించినా అది పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని భావం. అంతే కాదు. ప్రణ ఆయూగంషి తారిషత్. నః మా యొక్క ఆయూంషి - ఆయుస్సులను ప్రతారిషత్ - పొడిగించాలి కూడా. అంటే దీర్ఘకాలం జీవించాలని కోరిక. శరీర మాద్యంఖలు ధర్మ సాధన మన్నారు. శరీరమనే ఉపాధి బ్రతికి ఉంటేనే ఏ సత్కర్మ అయినా చేయగలం. సత్కర్మ ఆచరిస్తే గాని సత్ఫలిత మాసించ లేము. అందుకోసమే నూరేండ్లూ బ్రతకాలని కోరుకోవాలి మానవుడు. ఇది తరువాత రాబోతుంది జీవేమ శరదశ్శతమని. అక్కడ ఇంకా విపులంగా చెప్పుకోవచ్చు.
ఇంతకూ ఆదధి క్రావా ఆ జిష్ణు ఆ అశ్వ వాజి ఎవరని ప్రశ్న. ఎవరో కాదు. అహమన్న మహ మన్నాద అన్నట్టు ఈ చరాచర ప్రపంచాన్నంతా ఆహారంగా తీసుకొని అనేజదేకం మనసో జ వీయః అన్నట్టు మనసు కంటే వేగంగా భూన భోంతరాలన్నీ వ్యాపించిన ఏ అఖండ జ్ఞాన శక్తి ఉన్నదో అది. ఆ పరమాత్మ తత్త్వం. అదే సుగంధిం పుష్టి వర్ధనం. మా మనోవాక్కాయాలను సురభిళం చేయాలని దానినే ధ్యానిస్తున్నాము. దానికీ జలమనేది ఒక ఆలంబనం మాకు.
Page 56