#


Back

   చివర కక్కడ సూర్యుని తేజస్సులో వాటి నాహుతి చేయటమైతే ఇక్కడ సత్యమైన తేజస్సులో. సత్యమైన జ్యోతిస్సేమిటి. ఆ మాటకు వస్తే అగ్ని ఏమిటి. సూర్యుడేమిటి. జలమేమిటి. పృధివి ఏమిటి. అన్నీ సత్యమే. ఎందుకంటే పరమాత్మ తాలూకు ఉపాధులివన్నీ. పరమాత్మ సత్యమైనప్పు డాయన ఉపాధులూ సత్యమే. సత్యమైన పరతత్త్వమే ఇలా ఇన్ని రూపాలలో మనకు భాసిస్తున్నది. కనుక భౌతికమైన ఈ సత్యం ద్వారానే అభౌతికమైన ఆ సత్యాన్ని అందుకోవాలి మనం. కేవలం భౌతికంగా భావిస్తే అడ్డు తగులుతాయివి మనకు. వీటినే అభౌతికంగా భావిస్తే సహాయపడుతాయి. ఇదీ ఇందులో దాగి ఉన్న సత్యం.

   ఇవన్నీ చెప్పుకొన్న తరువాత మూడు సంధ్యలలోనూ మరలా దర్భలతో మార్జనం చేసుకొని ఈ క్రింది మంత్రం పఠించ వలసి ఉంటుంది.

దధి క్రాప్ట్లో అకారిషమ్ - జిష్ణో రశ్వస్య వాజినః - సురభినో ముఖాకరత్ - ప్రణ ఆయూగంషి తారిషత్ -

   ఆపోహిష్ఠాః అనే మంత్ర మింతకు ముందు చెప్పుకొన్నాము. దాని కర్ధం కూడా చెప్పుకొన్నాము. పోతే దానికి ముందొక నాలుగు వాక్యాలు చేరి మరలా ఆ మంత్రమే ఆవృత్తి అవుతున్నది. కాబట్టి వీటికి మాత్ర మర్ధం చెబితే చాలు. దధి క్రాష్ట్రః - దధి అంటే పెరుగు. ఆహారానికి ఉపలక్షణమీ మాట. క్రావా అంటే దాని వల్ల కలిగే బలం.

Page 55