అగ్ని దేవుడి భార్య పేరు స్వాహా దేవి. అంతా అగ్నిలో ఆహుతి చేస్తాము గనుక అది ఆయన కధీనమయి ఉంది గనుక ఆయన భార్యగా భావించారు పెద్దలు. అది ఒక సంకేతం. ఇంతవరకూ ఇది పూర్వాహ్ల సంధ్యా మంత్రమైతే ఇప్పుడు మాధ్యాహ్నిక మంత్రం చెబుతున్నారు.
ఆపః పునంతు పృధివీం - పృథివీ పూతా పునాతు మామ్ - పునంతు బ్రహ్మణ స్పతి - రృహ్మ పూతా పునాతు మామ్ - య దుచ్ఛిష్ట మభోజ్యం - యద్వా దుశ్చరితం మమ - సర్వం పునంతు మామాపో 2 సతాంచ ప్రతిగ్రహగం - స్వాహా
మనం చల్లే జలం మనమీదనే గాదు. మనం కూచున్న మన చుట్టూ ఉన్న పృధివి మీద కూడా పడుతుంటాయి జలకణాలు. కనుక పృథివి కూడా శుద్ధి అవుతుంటుంది. పృథివి తాను శుద్ధి అయి పృథివీ వికారమైన నా శరీరాన్ని మనస్సునూ కూడా పరిశుద్ధి చేయుగాక - ఆపః పునంతు పృథి వీం - పృథివీ పూతా పునాతు మా మ్మంటే అర్థమిదీ. అలాగే పునంతు బ్రహ్మణ స్పతిః - నాకు బ్రహ్మోపదేశం చేసిన ఏ సద్గురు వున్నాడో ఆయన కూడా నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. తాను బొట్టు పెట్టుకొని మరొకరికి బొట్టు పెట్టినట్టు ఒకరి నొకరు పవిత్రులను చేసుకొంటే ద్విగుణీకృత మవుతుంది పారిశుధ్యం. అదే అంతర్బహి శ్శౌచం. లోపలా వెలపలా శుచిత్వమే.
Page 52