ఏవంగుణ విశిష్టే - ఏవం విధ విశేషణ విశిష్టే - ఇవి రెండూ ఒప్పు. అలాకాక ఏవంగుణ విశేషణ విశిష్టే అన్నాడంటే అది తప్పు. ఎందుకంటే గుణమన్నా విశేషణ మన్నా రెండింటికీ ఒకటే అర్థం.
పోతే ఇక దీని అర్థం చెబుతున్నా. వినండి. మొట్టమొదట పరమాత్మ ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తున్నదీ కాల చక్రం. ఆయన జ్ఞానస్వరూపుడైతే ఇది క్రియా రూపిణి. అందులో సమష్టి ప్రాణంగా జ్ఞానంగా ఆవిర్భవించాడు బ్రహ్మదేవుడు. ఆది కర్తా సభూతనా మన్నారు. సృష్టి కంతటికీ ఆద్యుడాయన. హిరణ్య గర్భుడని కూడా అంటారాయనను. హిరణ్యం గర్భంలో ఉన్నవాడు. హిరణ్యమంటే చైతన్య ప్రకాశం. పోతే మనుష్యమానం గాక దేవమానం గాక బ్రహ్మమాన మని ఒకటున్నది. దాని ప్రకారం లెక్క గడితే ఆయనగారి ఆయుర్దాయం వంద సంవత్సరాలు. అందులో మొదటి 50 పూర్వపరార్ధ మంటారు. అది గడచిపోయిందిప్పటికే. అదే బ్రహ్మ కల్పం. పద్మ కల్పం. కాగా మిగతా 50 ద్వితీయ పరార్ధం. ఇది వరాహ కల్పం. శ్వేత వర్ణంతో ఉంటుంది. ఇదే నడుస్తున్నదిప్పు డాయనకు. మనువులలో వైవ స్వతుడనే రెండవ మనువు తాలూకు అంతరమిది
Period.
ఆ మన్వంతరంలో కూడా యుగాలు. వాటిలో ఆఖరిది కలియుగం. అందులో ప్రధమ పాదం.
Page 39