అంటే ఏమని అర్థం. మనమున్న గృహం ఎంతో విశాలమైన భూమండలంలో ఒకానొక ప్రదేశంలో ఉన్నట్టు అక్కడ సమస్త దేవతా మూర్తులూ మనచుట్టూ ఉన్నట్టు భావన చేయాలి మనం. దానితో దేశం పవిత్రమవుతుంది.
పోతే ఇక కాలం. కాల సంకీర్తనం చేస్తున్నాడిప్పుడు.
శ్రీమహా విష్ణో రాజ్ఞయా ప్రవర్త మానస్య ఆద్యబ్రహ్మణో ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే- వైవస్వత మన్వంతరే కలి యుగే - ప్రథమ పాదే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన - సంవత్సరే అయనే - ఋతౌ - మాసే - పక్షే - తిధౌ - వాసరే - నక్షత్రే యోగే కరణే ఏవం గుణ విశిష్టే శుభే అభ్యుదయ ముహూర్తే
ఇది కాల సంకీర్తనం. ఇందులో ఒకటి రెండు మెళకువలు గమనించాలి అనుష్ఠాతలు. సంవత్సర అయన ఋతు మాస పక్ష తిథి నక్షత్ర యోగ కరణాలు సామాన్యంగా పేర్కొన్నాము మేము. అది చెప్పుకొనేటపడు అవి ఏయే సంవత్సరాయనాదులో విశేష రూపంగా పేర్కొంటూ పోవాలి. సర్వజి న్నామ సంవత్సరే ఉత్తరాయణే ఇలాగా చెబుతూ పోవాలి. పోతే మరొక హెచ్చరిక ఏమంటే ఏవం గుణ విశిష్టే అనే సందర్భంలో రెండు ఒప్పు. ఒకటి తప్పు.
Page 38