అదే నామరూపాత్మకంగా ప్రసరించి ఈ చరాచర సృష్టి ఏర్పడింది. నిర్గుణం స్వరూపమైతే సగుణమైన ఈ సృష్టి దాని మాయా విలాసం. ఇదే ఇప్పుడు మనకు ప్రతిబంధకమయి కూచున్నది. కనుక దీనిని మరలా పారమేశ్వరమైన శక్తిగా దాన్ని మరలా పరమాత్మ స్వరూపంగా భావన చేయాలి మనం. అందుకోసం పరమాత్మ నామాలు స్మరిస్తూ పోవాలి. అదే కేశవాయ స్వాహా మొదలుకొని శ్రీకృష్ణాయ నమః ఉచ్చరించే వరకూ మనం చేస్తున్న పని. అవిద్యాకామ కర్మలనే అన్ని పాపాలనూ హరించే వాడు హరి. హరించి మన బుద్ధులను నాటి బంధం నుంచి బయటికి లాగే వాడు కృష్ణ. కర్షతీతి కృష్ణః - కర్షణ చేయటమంటే లాగటమనే శబ్దార్థం. అది అపకర్షణ అయినా కావచ్చు. ఉత్కర్షణ అయినా కావచ్చు. ముందు వీటి నుంచి అపకర్షణ చేసి తరువాత అసలైన తత్త్వం వైపు ఉత్కర్షణ చేయాలి. రెండింటికీ సమర్ధమైన దాయన శ్రీ. శ్రీ అంటే ఆయన నాశ్రయించిన మాయా శక్తి. పరమాత్మ వశంలోనే ఉంది కాబట్టి అది మన మాయనను స్మరిస్తూ పోతే ప్రతిలోమంగా అది మనలనీ ప్రతిబంధకాల నుంచి తప్పించి అనులోమంగా జీవిత గమ్యాన్ని మనకు ప్రసాదించ గలదని తాత్పర్యం.
ఇప్పుడా బలంతో మనమిలా భావించాలి. ఏమని.
Page 22