జరిగిందని చేసిందని కేవలం మన భావనే Notional not actual. ఒక్క మానవుడి భావనే అయితే సరిపోదు. ఈశ్వరుడి భావన కూడా తోడవ్వాలి దానికి. ఈశ్వర భావన వ్యక్తమయితే అది భౌతిక ప్రపంచం. అలా వ్యక్తమయిందే వాస్తవమని భావించి తన్నిమిత్తంగా కష్ట సుఖాలను భవిస్తున్నా ననుకొంటే అది భావ ప్రపంచం. రజ్జువు సర్పరూపం ధరించి కనిపిస్తే అది రజ్జు శక్తి. రజ్జువును చూడక దాన్ని సర్పాకారంగా దర్శిస్తే అది మన దృక్శక్తి -రెండూ శక్తే అయినా ఒకటి విద్యా మరొకటి అవిద్య. రజ్జు స్థానీయమైన పరమాత్మ ప్రపంచాకారంగా భాసించట మాయన విద్య అయితే తదాకారంగా భావించి చూడటం మన అవిద్య.
ఇప్పుడీ అవిద్య మనకు తొలగి పోవాలంటే మనపాటికి మనం పోగొట్టు కోలేము. ఆయన సాహాయ్య మెంతైనా అవసరం. కారణం మన దవిద్య. ఆయనది విద్య. అవిద్య పోవాలంటే విద్యే దాని కుపాయం మరేదీ గాదు. కనుక ఆ ఈశ్వర శక్తి మనకు తోడ్పడాలి. తప్పదు. ఎలాగా అని తాపత్రయ పడ నక్కర లేదు. మన బలహీనత గమనించి దాని పాటికదే మనకు కరావలంబ మిచ్చి పైకి లేపుతున్నది. నామరూప క్రియాత్మకంగా వ్యాపించినదా దివ్య శక్తే. సృష్టి తేజోబన్నాత్మాక మని వర్ణిస్తున్నది ఛాందో గ్యోపనిషత్తు. తత్తేజ అసృజత.
Page 150