శుద్ధి అశుద్ధి మనసులో ఉండాలి గాని బాహ్యంలో కాదని మొదట గ్రహించాము. అదే ఇక్కడ మరలా ఆవృత్తి అవుతున్నది. చేసే ప్రతి పనీ పరమాత్మ భావనతో చేస్తే మనం పవిత్రులమే. అక్కడ యః స్మరే త్పుండరీకాక్ష మన్నాడు. ఇక్కడ నారాయణా యేతి అంటున్నాడు. ఆద్యంతాలు రెండూ కలిపి పట్టుకొంటే పరమాత్మ తాలూకు స్మరణ లేదా భావనే ప్రధానమదే కర్మ మాలిన్యాన్ని క్షాళితం చేసి మన జీవత్వమనే సంకుచిత భావాన్ని నిర్మూలిస్తున్నదని చెప్పినట్టయింది – ఇదే ఏకవాక్యత Consistancy శాస్త్రంలో.
ఓమ్
తత్స ద్య్రహ్మార్పణ మస్తు
Page 148