#


Index

   వాటినే యద్యత్కరోమి అనే మాటలో సూచిస్తున్నాడు. ఏది చేస్తున్నా అది కర్మే. సకలం. మనోవాక్కాయాలతో చేసే సమస్తమూ.

   అయితే ఎందుకు చేయవలసి వస్తున్నదీ కర్మ కలాపమంతా ఈ జీవుడనే కర్త. ప్రకృతేః స్వభావాత్- ప్రకృతి వాడిచేత చేయిస్తున్నది. అలా చేయించటం దాని స్వభావం. చేయిస్తే చేయటం వీడి స్వభావం. ప్రకృతి గుణాలనేవి మనలోపలా వెలపలా పరచుకొని ఉన్నాయి గదా. ప్రకృతేః క్రియ మాణాని గుణైః కర్మాణి అని భగవానుడే చెబుతున్నాడు. కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జై ర్గుణైః - మన కిష్టమున్నా లేకున్నా బలవంతంగా చేయిస్తుంటాయి ప్రకృతి గుణాలు. అది సత్త్వమే కావచ్చు. రజస్సే కావచ్చు. తమస్సే కావచ్చు. మనస్సు సత్త్వ ప్రధానం. ప్రాణం రజః ప్రధానం. శరీరం త మః ప్రధానం. ఇక మనం కర్మ చేయకుండా తప్పించు కోట మెలాగా. చేసి తీరవలసిందే.

   ఇలా కర్తృ కరణ క్రియలు మూడూ ఎప్పుడు తోడయినాయో సంసారమనే విష వలయంలో నుంచి బయటపడలేడీ జీవుడనే నరుడు. ఇలాటి నరుడు నారాయణుడు కావాలంటే ఇప్పుడేమిటి మార్గం. నారాయణాయేతి సమర్పయామి. చేయకుండా మానేయటం కాదు. చేస్తున్న ప్రతి కర్మా నారాయణుడికే సమర్పించాలి. నరుల కయనం గదా నారాయణుడంటే. అయన మంటే అధిష్ఠాన మాశ్రయం Base.

Page 146