నారాయణత్వం మనకు రావాలంటే మనకిప్పుడున్న నరత్వం పోవాలి. నరత్వమే జీవ భావం. జీవుడంటే కర్తా భోక్తా. కర్తృత్వ ముంటే చాలు. భోక్తృత్వం పిలిస్తే పలుకుతుంది. కర్తనని ఎప్పుడను కొన్నాడో అప్పుడు కర్మ అనేది తయారయింది. కర్మ చేసేవాడే కర్త. దేనితో చేయాలా కర్మ. దేనితో అన్నప్పుడది కరణం. కర్మ సాధన మని అర్ధం. ఎన్ని అవి మూడు. కాయేన వాచా మనసా మనో వాక్కాయాలు. వీటికే త్రికరణాలని పేరు. ఏ పని చేయాలన్నా మనసుతో ముందు సంకల్పిస్తాము. తరువాత మాట ద్వారా బయట పెడతాము. ఆ తరువాత శరీరంతో చేస్తాము.
ఇందులో వాక్కనేది కర్మేంద్రియాలలో ఒకటి. కర్మేంద్రియాలూ జ్ఞానేంద్రియాలూ అన్నీ కలిసి మొత్తం పది ఇంద్రియాలు. ఇవన్నీ కరణాలే. పనిచేసే సాధనాలే. అంచేత వాక్కంటే ఒక వాగింద్రియమే ననుకొంటారని ఇంద్రియైర్వా అన్ని ఇంద్రియాలనూ పరిగణిస్తున్నదీ మాటతో. పోతే కరణాలే చెప్పారు గాని ఇంతవరకూ కర్త ఎవరో చెప్పలేదే అంటే కంఠోక్తిగా చెబుతున్నాడిప్పుడు. బుద్ధ్యాత్మ నావా అని. బుద్ధ్యాత్మ విజ్ఞానాత్మ అంటే కర్రాత్మ. జీవుడని అర్ధం. వాడే కర్త. పోతే కర్మ ఏమిటిక. ఒకటి గాదు. సవాలక్ష. అవినిత్య నైమిత్తిక కామ్య నిషిద్ధాలే కావచ్చు. లేదా లౌకికమైన దర్శన స్పర్శన వచనా దానాదులే కావచ్చు. అటు శాస్త్రీయమైనవీ కర్మలే. ఇటు లౌకికమైనా అవీ కర్మలే.
Page 145