విద్యా విద్యా వంతుడని భావం. అలాంటి వారి నుద్ధరిస్తే పరమాత్మ - తన్ముఖంగా అందరినీ ఉద్దరించిన వాడవుతాడు. బ్రహ్మణ్య దేవాయ. ఆ దేవుడప్పుడు బ్రహ్మణ్యుడవుతాడు. విద్యోపదేశం ద్వారా విద్యావంతులకు తద్ద్వారా అవిద్యావంతులకూ హితకారి అవుతాడని అర్ధం. ఎవడా దెవుడెలా అవుతాడు. కృష్ణాయ - కర్షతీతి కృష్ణః ఎవడలా ఉపదేశించి ఈ మానవ లోకాన్ని తన వైపు కర్షణ చేస్తాడో లాక్కొని పోగలడో వాడే కృష్ణుడు. అప్పుడే గోవిందుడు. గోవంటే విద్య అని గదా చెప్పాము. దాని బలంతో విందతి ప్రాప్నోతి. బ్రహ్మ పదాన్ని ఈ విద్యా వంతుడు పొందేలాగా చూడగలడని తాత్పర్యం.
పోతే ఇప్పుడిక బ్రాహ్మణుడైన వాడు గాయత్రికి ఉద్వాసన చెబుతున్నాడు. ఆవాహన అయింది. అనుష్ఠాన మయింది. ఇక ఉద్వాసన. గాయత్రీ అంటే బ్రహ్మ విద్య అది గదా చెప్పారు. దాన్ని నిత్యమూ దగ్గరుంచు కోవాలి గాని ఉద్వాసన చెప్పటం దేనికని ప్రశ్న వస్తుంది. దీనికి జవాబింతకు పూర్వమే చెప్పాము. విద్య అనేది కేవల మాలంబనం మాత్రమే. దాని ద్వారా అసలైన తత్త్వాన్ని పట్టుకొన్న తరువాత పదిమందికీ అందటానికి దాన్ని విస్తరింప జేయాలి. మరలా తాను విస్మరించకుండా ఎప్పటికప్పుడను సంధానమూ చేసుకొంటుండాలి. విస్తరించటమే ఉద్వాసన. అనుసంధానమే ఆవాహన. అందుకే అహరహ స్సంధ్యో పాసన.
Page 134