#


Index

   స్వరూపంగా అది ఏకమే అయినా తన మాయా శక్తి ప్రభావంతో అనేక రూపాలుగా భిన్నమయి కనిపిస్తుంటుంది. ఏమిటా రూపాలని అడుగుతారా. సహస్ర పాదాక్షి శిరోరు బాహవే - వేలాది పాదాలు - వేలాది శిరస్సులు- వేలకు వేలు ఊరువులు - బాహువులూ ఇలా అసంఖ్యాక మైన రూపాలు ధరించి కనిపించ గలదు. అవే ఈ చరా చర పదార్థాలన్నీ ఇప్పుడు మనం చూస్తున్నవి. ఇవి అమూర్తమైన ఆ తత్త్వం మూర్తీభవించి కనిపించే రూపాలే.

  సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే అలాగే వేలకొలది నామాలు చాలా ఉన్నాయి దానికి. రూపాలున్నప్పుడు నామాలు కూడా ఉండి తీరుతాయి. నామరూపాలు రెండూ అన్యోన్యాశ్రయాలు. నామమంటే పేరని గాదు. మనసులో కలిగే వృత్తులు. జ్ఞానం కదిలితే అది వృత్తి Idea. దానినే నోట ఉచ్చరించి నామమంటున్నాము. ఉచ్చరించక ముందు కూడా నామమే అది వృత్తి రూపంగా. ఆ వృత్తి ఎలా ఏర్పడింది జ్ఞానంలో. జ్ఞేయ మనేది బాహ్యంగా ఒకటుంటేనే గదా. అదే రూపం Thing or form అప్పటికి రూపం లేకుంటే నామమేర్పడదు. నామమనేది ఏర్పడితే గాని ఇది రూపమని గుర్తించలేము. ఇవే వాచ్య వాచకాలూ. గ్రాహ్య గ్రాహకాలూ. శబ్దార్ధాలూ అని వ్యవహరిస్తుంటారు ఎవరికి తోచినట్టు వారు. మొత్తం మీద ఈ పరస్పర మవి నాభూతంగా ఉన్న నామరూపాల కాధారమేమిటి.

Page 131