#


Index

   అనంతాయ అనంతమని ఒక్కమాటలో నిర్దేశించారు దాన్ని. అంతం లేని దేదో అది అనంతం. దేశకాల వస్తువులే మన జ్ఞానానికంతం. అవి జ్ఞానంలో నే లయమై జ్ఞాన మఖండంగా మిగిలిపోతే అది అనంతమూ ఏకమే అవుతుంది. దానికప్పుడు మరొక దాని అపేక్ష లేదు కాబట్టి నిరపేక్షమది. దానికే ప్రజ్ఞానమని పేరు పెట్టిందుపనిషత్తు. ప్రజ్ఞానం బ్రహ్మ బ్రహ్మం ప్రజ్ఞాన స్వరూపమట. ప్రకృష్టమైన జ్ఞానమే ప్రజ్ఞానం. ప్రకృష్టమంటే పరిపూర్ణం. జ్ఞానం పరిపూర్ణ మెప్పుడవుతుంది. జ్ఞాతా జ్ఞేయం రెండు కొసలూ అందులో లయమైతే అప్పుడది పరిపూర్ణం. జ్ఞాతే జీవుడు జ్ఞేయమే జగత్తు. ఇవే అన్నాన్నాదులు. ఇవే శివకేశవులు. ప్రజ్ఞానంలో నుంచి రెండు కొసలూ బయటకి వస్తే ఏర్పడుతాయవి. లోపల చేరితే ఒక్కటే. ఇవి రెండూ దానికి శాఖలైతే అది మహా వృక్షం. శాఖలు వృక్షం కన్నా వేరుగా నట్టే పరిపూర్ణమైన ఆ జ్ఞానానికీ జ్ఞాతృజ్ఞేయాలు వేరుగావు. అంటే శివకేశవులు ఇద్దరూ కలిసి బ్రహ్మ స్వరూపంగా ఏకమేనని చెప్పక చెప్పినట్టయింది. ఈ రహస్యం తెలియకనే పేచీ పడుతున్నారీ మూర్ఖులని వ్యంగ్యంగా అతివాదులకు బుద్ధి చెప్పినట్టు కూడా అయింది. నమోస్త్వనం తాయ- అలాటి ఏకమైన అఖండమైన తత్త్వానికి

   నమస్కారం. అనంతమయి నప్పుడది ఆత్మ స్వరూపమే గదా. ఇక నమస్కార మెవరికి. అంటే చెబుతున్నారు. సహస్ర మూర్తయే - వందలు వేలు రూపాలు కూడా అదే ధరిస్తున్నది.

Page 130