యధాంతరం నపశ్యామి తధామే స్వస్తి రాయుషి- ఇంతకూ ఇద్దరికీ అణుమాత్రం భేదం చూచినా దెబ్బ తింటాము. అలా తేడా చూడనంత వరకూ మనకు క్షేమం. ఆయుర్దాయం పెరుగుతుంది. నిర్విఘ్నంగా నూరేండ్లు బ్రతికినా బ్రతుకుతాం. లేకుంటే అర్ధాయుష్కులమై నడమంతరంగానే నశించి పోతాం.
చూడండి. ఎంత గొప్ప ఉపదేశమో ఇది మనకు. ఈ సూక్ష్మం తెలియక మా విష్ణువు గొప్పని కొందరూ లేదు మా శివుడే గొప్పని కొందరూ శివుడు శ్మశాన వాసి అమంగుళుడని వారూ విష్ణువు భోగలాలసుడూ అలంకార ప్రియుడూ షోకిలా పురుషుడని వీరూ తెలిసీ తెలియక ఒకరితో ఒకరు కుమ్ము సుద్దు లాడుతున్నారు. వీరి కటు శాస్త్రమూ తెలియదు. ఇటు పురాణ హృదయమూ తెలియదు. మిడి మిడి జ్ఞానంతో సతమత మవుతున్న మూర్ఖులు వీరు. సపండితావ శదః మూర్ఖ ఇన ఉపేక్షణీయః అని భగవత్పాదులు చెప్పినట్టు వీరిని పనికి రాని వారి జాబితాలో చేర్చి ఒక లంబరు రూములో పారేయటం తప్ప మనం చేసే దేమీ లేదు. వారితో చర్చకు దిగటం మనకే సిగ్గు చేటు. ఇద్దరికీ ఒక పక్క అభేదం స్పష్టంగా కనిపిస్తున్నా ఇంకా వీరు తగాదా పడుతున్నారంటే ఎంత హాస్యాస్పదం. విష్ణు నామాలలో కుప్పతెప్పలుగా ఉన్నాయి శివనామాలు. వాటినేమి చేస్తారు వైష్ణవులు. చదవటం మానేస్తారా.
Page 128