#


Index

   అదంతా లయం చేసుకొంటే మిగిలేది ఏకమైన జ్ఞానమే గదా. అది వైరాగ్యం. కనుకనే విష్ణువు భోగానికైతే శివుడు వైరాగ్యానికి చిహ్నమై కూచున్నారు.

   ఇంతకూ జ్ఞేయం ప్రమేయమైతే జ్ఞానం దానికి ప్రమాణం. ప్రమాణ ప్రమేయాలు రెండూ పరస్పర సాపేక్షాలు. Inter dependent జ్ఞానాన్ని విడిచి జ్ఞేయం లేదు. జ్ఞేయాన్ని విడిచి జ్ఞానం లేదు. జ్ఞానమగ్ని. జ్ఞేయం దానిలో ఆహుతి అయ్యే సోమం. అగ్నీ షోమ యాగమని పేరు దీనికి. దీని వివరమంతా నా భాగవత సామ్రాజ్యం చదివితే తెలుస్తుంది పాఠకులకు. కనుక ఇలా శివ విష్ణువులని రెండు శాఖలయి కనిపిస్తున్నా రెండూ కలిసి ఒకే వృక్షానికి చెందిన శాఖలు. వృక్ష రూపంగా రెండూ అభిన్నమే. శాఖలుగా చూస్తేనే ఎక్కడికక్కడ భిన్నమై కనిపిస్తుంది. అలా చూడకండి. ఏకంగా చూడండి అప్పుడే మీకది మోచకమవుతుంది. లేకుంటే బంధకమే సుమా అని హెచ్చరిస్తున్నదీ మంత్రం. ఎలాగ శివాయ విష్ణు రూపాయ. శివుడంటే ఎవరో గాదు. విష్ణు స్వరూపుడే. శివ రూపాయ విష్ణవే విష్ణువంటే ఎవరో గాదు. మరలా శివస్వరూపుడే. శివస్యహృదయం విష్ణుః శివుని ఆంతర్యం విష్ణువే. విష్ణో శ్చ హృదయం శివఃవిష్ణువాంతర్యం కూడా శివుడే. యధా శివమయో విష్ణుః - విష్ణువంటే శివ మయుడు. శివునిలో చేరిపోయాడు. ఆయనతో ఏకం. అలాగే ఏవం విష్ణుమయ శ్శివః - శివుడు కూడా విష్ణువుతో ఏకం.

Page 127