#


Index

   జ్ఞేయమైనదీ ప్రపంచమే గదా. ఇది నామరూప క్రియలతో చిత్ర విచిత్ర రూపంగా కనిపిస్తున్నది. ఎప్పటికప్పుడు మారిపోతున్నది. నవ ననోన్మేషంగా ఎన్నో వేషాలు వేస్తూ కనిపించేసరికి మనకెంతో ఆకర్షకంగా తోస్తుంటుంది. సృష్టి లయాలకు మధ్య కాలంలోనే ఇలా కనిపిస్తున్నది కాబట్టి స్థితి కాలమిది. స్థితి కారుడే గదా విష్ణువు. ఆయనే గదా మత్స్య కూర్మాద్యనే కావతారాలెత్తు తుంటాడు. ఎప్పటికప్పుడనేక రూపాలు ధరించి భ్రమ గొలుపుతుంటాడు. దీన్నే గదా మనం జ్ఞేయమని చూస్తుంటాము. దీన్నే గదా జ్ఞానంతో గ్రహించి అందులో ఎప్పటికప్పుడు ఏకం చేసుకొంటున్నాము. ఆ ఏకం చేసుకోటమే గదా లయం. కనుకనే విష్ణువు స్థితి కారుడైతే శివుణ్ణి లయకారుడని వర్ణించారు. ఆ తృతీయ నేత్రం అగ్ని. జ్ఞానమే అగ్ని. జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి అన్నట్టు జ్ఞేయమైన ఈ ప్రపంచమంతా జ్ఞానంలోనే లయమై పోతున్నది. ఇది అన్నమైతే అది అన్నాద. జ్ఞేయ మన్నం - జ్ఞాన మన్నాదం. అన్నాన్ని విడిచి అన్నాదుడు లేడు. అన్నాదుడు లేకుంటే అన్నాని కర్ధం లేదు. జ్ఞేయ మన్నం జ్ఞానమన్నాద అని గదా చెప్పాము. జ్ఞేయం విష్ణు స్వరూపం. జ్ఞానం శివ స్వరూపం. జ్ఞేయమనేకం. జ్ఞాన మేకం. అనేకం భోగానికి. ఏకం వైరాగ్యానికి. భోగమంటే అనుభవం చరా చర పదార్ధాలనే గదా అనుభవిస్తుంటాము. అది భోగం.

Page 126