#


Index

   రెండూ. వీటి కయన మంటే అధిష్ఠానం. అది ఈ రెంటికీ అతీతమైనది. కనుక నిరాకారం వ్యాపకం. అలాంటిది మనకు గోచరం కాదు. నారాయణః పరో వ్యక్తాత్- అవ్యక్తమైన ప్రకృతి కన్నా అతీతమైన తత్త్వం మనకెలా గోచరిస్తుంది. కాని ఎప్పటికైనా మనం చూడక తప్పదు. లేకుంటే మోక్షం లేదు మన జీవితానికి. అందుకే విద్మహే. చూడాలి మనమంటున్నాడు. మరి అగోచరం కదా ఎలా చూడాలంటారు. అందుకే వాసుదేవాయ ధీమహి. వాసుదేవ రూపంగా ధ్యానించాలి. మనసుకు తెచ్చుకోవాలి. వాసుదేవ అంటే చెప్పాము గదా. అస్తి భాతి ఉన్నది ఉన్నట్టు స్ఫురిస్తున్నదని. మీరీ ప్రపంచంలో ఏది చూడండి. ఏదో ఒక రూపంలో ఉంటుంది. అది అలా ఉన్నట్టు మనకు స్ఫురిస్తుంటుంది. సత్తా స్ఫూర్తులు లేని పదార్ధమే లేదు లోకంలో. బాహ్యంగానే కాదు మనసులో కలిగే ఏ ఆలోచనైనా సుఖదుఃఖాది ఏ అనుభవాలైనా అవి అస్తి భాతి ఉన్నాయనే భాసిస్తున్నాయనే అనుభవానికి వస్తుంటాయి. అలా కాకుంటే అసలేదీ మన అనుభవానికే రాదు సుమా. కాబట్టి భావంలో బాహ్యంలో ప్రతి ఒక్కటీ వాసుదేవే. ఏది మనసుకు వచ్చినా అది వాసుదేవే. కనుక అంతటా పరుచుకొని ఉన్న ఆ వాసుదేవ రూపాన్నే మనసులో పెట్టుకోవాలి. అదే నారాయణ తత్త్వాన్ని చూపుతుంది మనకు.

Page 120