#


Index

   ఓం నమో భగవతే వాసుదేవాయ - అందుకే దానికే చెప్పాలి మనం నమస్కారం. ఇంకొక దేవతకూ మహర్షులకూ గురువులకూ ఎవరికి మనం నమస్కరించినా ఆ రూపంలో ఉన్న ఆ వాసుదేవుడికే చెందుతాయన్ని నమస్కారాలు. అది వాసుదేవే గాక భగవతే. భగవంతుడు కూడా. జ్ఞానైశ్వర్యాది షడ్గుణాలకూ భగమని పేరు. భగోస్యాస్తీతి భగవాన్. ఆ గుణా లెవరి కుంటే వాడు భగవంతుడు. జ్ఞానశక్తి క్రియాశక్తీ సంపూర్ణంగా ఉన్నవాడని అర్ధం. జ్ఞానం స్వరూపమైతే క్రియ దాని విభూతి. ఒకటి నిర్గుణం మరొకటి సగుణం. నిర్గుణమైన వాసుదేవ స్వరూపమే సగుణమైన దేవ ఋషి గురు పితృ కామ మన్యు రూపంగా భాసిస్తున్నది. కనుక ఆ ఒక్క దాన్ని ఆశ్రయిస్తే చాలు. దాని చెప్పు చేతల్లో ఉన్న ఇవన్నీ మాట వింటాయి మనకు మేలు చేస్తాయి.

   కనుకనే నారాయణాయ విద్మహే వాసు దేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్తనే మాట వచ్చింది. ఏమిటీ మాట. నారాయణ వాసుదేవ విష్ణు ఒకటి కావా. మూడింటికీ ఒకటే అర్ధమయినప్పు డొక చోట విద్మహే ఒకచోట ధీమహి మరొక చోట ప్రచోదయాత్తనే మాటలేమిటి. అక్కడే ఉంది విశేషం. గౌణంగా తీసుకోవాలీ నామాలను విష్ణు నామాలలాగా. అలా తీసుకొంటే నారాల కయన మేదో అది నారాయణ. నారమంటే పాంచభౌతికమైన జగత్తు పంచకోశాత్మకమైన జీవ సమూహం.

Page 119