#


Index

సంధ్యావందనము

పూర్వార్దము

   గాయత్రీ వ్యాహృతి స్సంధ్యా అని అమ్మవారిని కీర్తించాడు హయగ్రీవ మహర్షి. అంచేత సంధ్య ఎవరో గాదు. గాయత్రే. ఆ గాయత్రి కూడా ఎవరో గాదు. లలితా దేవే. అంటే పరమాత్మ తాలూకు మహాశక్తే. ఆ శక్తి కాల స్వరూపిణి. కాలమంటే కదిలేది. కనుకనే అమ్మవారికి కాలీ అని పేరు వచ్చింది. మహాశక్తి గనుక మహాకాలి అని అన్నారు. అచలమైన తత్త్వం నుంచి చలించి వచ్చిందా మహాశక్తి. పరమాత్మ అచల స్వరూపుడు. సర్వవ్యాపకమైన తత్త్వమెలా చలిస్తుంది. పరిపూర్ణమూ పరిశుద్ధమైన జ్ఞానమది. అలాంటి జ్ఞాన స్వరూపం నుంచి క్రియారూపంగా బయలుదేరిందా శక్తి. అది అచలమైతే ఇది చలం. చలించి పరా పశ్యంతీ మధ్యమా వైఖరీ అని నాలుగు దశలలో క్రిందికి దిగి వచ్చింది. వచ్చి అదే చివరకు వైఖరీ రూపమైన ఈ ప్రపంచంగా కనిపిస్తున్నది. కనుక మనం చూచే ఈ చరాచర ప్రపంచమేదో గాదు. నిరంతర భ్రమణ శీలమైన ఆ మహాశక్తే.

Page 12