సంధ్యా గాయత్రి అంటేనే అది బ్రహ్మ విద్య. మరి అధ్యాత్మ దృష్టితో గాక ఏ దృష్టితో చూడాలి దాన్ని. ఎక్కడ బట్టినా ఉన్న సత్యమదే అయినప్పుడది గాక ఏది చూపాలి లోకానికి. అదే ఉన్నప్పుడిక చూపటం దేనికంటారా. ఉన్నా మరుగుపడి ఉంటున్నది కాబట్టి బయటపెట్టటమే మనం చేస్తున్న పని. ఇది నేను చాలాకాలం క్రిందటనే ప్రవచనం చేశాను అక్కడక్కడా. కాని రికార్డు సరిగా కాలేదది. ఇటీవల కొందరు స్వదేశవాసులూ విదేశ వాసులూ అది గ్రంధరూపంగా వస్తే బాగుంటుందని కోరిక వెలిబుచ్చారు. అంచేత వారి కోరిక మేర కా కాసెట్టులలోని విషయం కొందరు శిష్యురాండ్రు కొంత వ్రాసి ఇస్తే మరికొంత భావన చేసి ప్రస్తుత మీ రూపంగా జిజ్ఞాసువులైన పాఠకుల కంద జేస్తున్నాను. ఇది మీకు తృప్తి నిస్తే నాకూ తృప్తే.
ఇతి
బుధ జన విధేయః
శ్రీనివాస నామధేయః
Page 11