#


Index

   మిగతా వన్నీ దీప ప్రకాశాలైతే సూర్య ప్రకాశం లాంటిదది. అంచేత మీరు బాహ్యమని చెప్పండి. ఆంతరమని చెప్పండి. ఏ అర్థం మీరు చెప్పినా అవన్నీ ఆ పరమార్ధంలో చేరిపోవలసిందే. ఇలాటి అద్వైత దృష్టితో చేసిన వ్యాఖ్యానమే అసలు వ్యాఖ్యాన మనిపించుకొంటుంది. అలా వ్యాఖ్యానం చేసిన వాడే నిజమైన వ్యాఖ్యాత కూడా.

  నా అదృష్టం కొద్దీ అలాటి వ్యాఖ్యాతల వంశంలోనే జన్మించాను నేను. ఇప్పటికి నలభయి యాభయి ఏండ్ల నుంచీ అద్వైత సిద్ధాంతాన్నే నమ్ముకొని ఆ దృష్టితోనే బ్రతుకు సాగిస్తున్నాను. ఏది చూచినా ఆ దృష్టితోనే చూస్తున్నాను. ఇటు భౌతిక జగత్తును చూచినా అదే దృష్టి. అటు వాఙ్మయ జగత్తును చూచినా అదే దృష్టి. అలాటి అద్వైత దృష్టి నేమర కుండానే ఉపనిషత్తుల దగ్గరి నుంచీ భారత భాగవత రామాయణాది గ్రంధాల వరకూ అన్నింటినీ సమన్వయిస్తూ వచ్చాను. తదను గుణం గానే అనేక గ్రంధాలు రచించి ప్రకటించాను కూడా. అవి చదివిన వారికందరికీ ఇది అనుభవ సిద్ధమే. ఇది ఎంతో మాకు విజ్ఞానదాయకంగా ప్రయోజన కారిగా ఉంది లాగే ఉండాలి ఏ వ్యాఖ్యానమైనా అని ఎంతగానో ప్రశంసిస్తూ వచ్చారు కూడా.

  అంచేత సార్వజనీనమైనదీ మార్గమని చెప్పి ప్రస్తుత మీ గ్రంథం కూడా నేనా అద్వైత దృష్టితోనే చూచి గంభీరమైన ఆ భావాలనన్నింటినీ యధాశక్తిగా బయటపెట్టదలచాను.

Page 10