#


Index

   ఇలాటి కాలస్వరూపిణి అయిన మహాశక్తిని మనమావాహన చేసుకొని దాన్ని నిత్యమూ ధ్యానిస్తూ పోతే మరలా ఇది మనల నా మూలతత్త్వం దగ్గరికి చేర్చగలదు. ఏది ఎక్కడి నుంచి వస్తుందో అదే మరలా మన బుద్ధి నా స్థానం చేర్చటాని కాలంబనం. కనుకనే మనం సంధ్యను వందనం చేయాలి. సమ్యగ్ధ్యానమే సంధ్య అనే మాట కర్థం. చక్కగా ధ్యానం చేస్తే అది సంధ్య. సంధిలో వచ్చేది గనుక సంధ్య అని కూడా పేర్కొన్నారు. సర్వకాల సర్వావస్థలలోనూ ధ్యానం చేయవలసిందే. కారణమేమంటే సర్వ కాలాలూ సర్వావస్థలూ కూడా ఆ మహాశక్తే వ్యాపించి ఉంది. అంచేత ఎప్పుడూ ఏ దశ అని ప్రశ్నే లేదు. ఏ కాలంలో చేసినా అది మనకు ఫలితమిస్తుంది. ఈ కాలమనేది భూత భవిష్య ద్వర్త మాన రూపంగా విభజించి వ్యవహరిస్తున్నామే. ఇది ఆ దేవత బాహ్య రూపం. దాని ఉపాధి. ఈ ఉపాధి రూపంగా ఏది అభివ్యక్తమవుతున్నదో అది దేవత. కాబట్టి ఆ కాలాధి దేవత నీ కాలం ద్వారా మనమందుకోవాలి. అదే ఆరాధన. ఉపాసన. వందనం. సంధ్యావందనం.

   కాలం ద్వారా పట్టుకోవాలంటే ఏమిటర్ధం. మనమందరమూ పుట్టిందీ బ్రతుకుతున్నదీ చివరకు కన్ను మూసేదీ కాలంలోనే. కాలాన్ని దాటిపోలేము. కాలాధీనులం మనం. కాలరూపిణి అయిన ఆశక్తి క్షేత్రంలోనే మన జీవితమంతా సాగిపోతున్నది.

Page 13