#


Index

   మునులనేమిటి. సద్గురువులు నేమిటి. మన మూల పురుషులైన పితరులనేమిటి. అందరినీ భక్తి శ్రద్ధలతో సేవించాలి మనం. దానికేవైనా అంతరాయా లున్నాయంటే అవి రెండే. కామమూ మన్యువూ. అంటే కామ క్రోధాలు. ఈ ద్వంద్వాలు రెండూ అడ్డు తగులుతున్నంత వరకూ ఏ సత్ఫలితాన్నీ ఆసించ లేము. అవి పోవాలంటే వాటిని మనమీదికి పురికొల్పే ఏ శక్తులున్నాయో వాటిని మంచి చేసుకోవాలి. అవి వాటి అధిదేవతలు. కామోకార్షీత్ మన్యు రకార్షీత్ - అవే ఈ కామక్రోధాలను మనకు కల్పిస్తున్నాయి. కాబట్టి వాటికి నమస్కారం చెప్పాలి మనం. వాటి ప్రయోగోప సంహారాలు రెండూ ఆ దేవత చేతిలోనే ఉన్నాయి కాబట్టి అవి ప్రసన్నమైతే ఉపసంహరిస్తాయని అర్ధం.

   అప్పటికి దేశకాల వస్తువులు మూడింటినీ పరమాత్మే వ్యాపించి ఉన్నాడనే బ్రహ్మ భావనతోనే సమస్తమూ దర్శించి నట్టయింది సాధకుడు. పృథి వ్యాపస్తేజోవాయు రాకాశాత్. అసలీ పృధి వ్యప్తే జోవాయ్వాకాశా లెక్కడివి. ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి. ఏది వీటికి మూలం. ఆ పరమాత్మే గదా. అది అవ్యక్తమయితే ఇవి దాని వ్యక్తమయిన రూపం. భూతమంటే ఆవిర్భూతమనే అర్ధం. ఇవి ఒకదానిలో నుంచి ఒకటి వచ్చినట్టు కనిపిస్తున్నా అన్నీ కలిసి చివరకా మూల తత్త్వమైన పరమాత్మను చేరవలసి ఉంది. ఎందుకంటే సూక్ష్మంలో నుంచే స్థూల మేర్పడుతుంది.

Page 117