#


Back

   పోతే ఈ దిశలకూ ఈ దిశలలో నివసించే దేవతలకూ నమస్కారం చెప్పటం వల్ల అధిభూత అధిదైవత రూపంగా వ్యాపించిన పరమాత్మకే నమస్కరించి నట్టయింది. దేవతాభ్యః -అని బహువచనంలో ప్రయోగించటం కూడా సాభిప్రాయమే. దిగ్దేవత ఒక్కడే అయినా ఆయన కళత్ర పుత్ర మిత్రాది పరివార ముంటుంది గదా. ఆ పరివార దేవతలు కూడా కలిసి వస్తారని అభిప్రాయం. అప్పటి కన్ని వైపులా పరమాత్మ భావనే విస్తరించి ఉండాలి ఈ నమస్కరించే వ్యక్తికి.

  అంతేకాదు

నమో గంగా యమునయోర్మధ్యే యే వసంతి తే మే ప్రసన్నాత్మాన శ్చిరం జీవితం వర్ధయంతి. నమో గంగా యమున యోర్ముని భ్యశ్చ నమః సంధ్యాయై నమః -సావిత్ర్యై నమః గాయత్ర్యై నమః సరస్వత్యై నమః సర్వాభ్యో దేవతాభ్యో నమః - దేవే భ్యోనమః ఋషిభ్యో నమః మునిభ్యో నమః గురుభ్యో నమః పితృభ్యో నమః - కామో కార్షీ న్మన్యుర కార్షీ న్నమో నమః

  దేవతలకు నమస్కరించి వారి అనుగ్రహం సంపాదించిన తరువాత మహర్షుల ఆశీస్సులు కూడా అందుకోవాలి మనం. ఋషులంటే వారా దేవతా మూర్తులను దర్శించినవారు. ఋషులే గాక మునులు కూడా వారు. దర్వించి తద్వారా పరాదేవత అయిన పరమాత్మ తత్త్వాన్ని మౌనంగా ధ్యానిస్తున్న వారు కూడా.

Page 114