#


Index

   అందుకే కిరణాలన్నారు వాటిని. చిత్ర విచిత్రాలవి. అనేకమూ అనంతమూనని అర్థం. కాని మన బాధ్యత ఏమంటే ఉద్వయమ్ తమసస్పరి పశ్యంతః ఈ త్రిగుణాత్మకమైన ఆలోచనల నతిక్రమించి చూడాలి. ఇదే తమస్సు మన పాలిటికి. తమసో మా జ్యోతిర్గమయ. ఇది దాటి చూడగలిగితే ఆ చైతన్య ప్రకాశ మందుతుంది మనస్సుకు. సంసార సాగరం నుంచి పైకి వస్తున్న తేజస్సది. పశ్యేమ శరదశ్శతం మన నూరేండ్ల జీవితమూ దాన్ని చూడటానికే దాన్ని వినటానికే దాన్ని ఒకరి కొకరు చెప్పుకోటానికే. అప్పుడే ఇది సార్ధకం. సాధన మైనప్పుడే సార్ధకం Purposeful అలాటి అనుభూతి కోసం నూరేండ్లూ బ్రతకాలని రోగాలూ రొష్టులూ రాగూడదని ఆపదలు ముంచుకు రాగూడదని కోరుకోవాలి మనం. అసలు నిరంతర మా చింతన చేస్తూ ఉంటే అది మనల నెప్పుడూ తప్పజూడదు. మన అభీష్టాన్ని సఫలం చేసి తీరుతుంది. అంతా పరమాత్మ స్వరూపమే గదా. ఆ సత్యాన్ని గుర్తించిన సాధకుడికేది గాని ఎలా హాని చేయగలదు. ఇదీ బరవసా.

   అది మహర్షులు పూర్వమనుభవానికి తెచ్చుకొనే మనకు బోధిస్తూ వచ్చారు. అదే ఈ మంత్రత్రయం ద్వారా మనకు వారు చేసే బోధ. ఇంతకూ పరమాత్మే సూర్యుడనే ఉపాధి ధరించి మిత్రుడుగా మనలను ప్రతి దినమూ కలుసుకొంటూ సవితగా మనకు చేయూత నిచ్చి అది మనం గట్టిగా పట్టుకొన్నామా లేదా అని పరీక్షించటం కోసం వరుణుడుగా అస్తమించి

Page 110