ప్రకృతి గుణాలు మాచేత అలా చేయిస్తుంటాయి. త్రిగుణాధీనమైన బ్రతుకు బ్రతుకు తున్నాము. అంచేత దైవ శక్తులైన మీ విషయంలో ఏలాటి ద్రోహమైనా చేసి ఉండవచ్చు. మేము మానవులమూ మీరు మాకంటే గొప్పవారైన దేవతలని చూడక మాతోడి మానవులుగానే మిమ్ము భావించి తక్కువ చేసి చూడవచ్చు మిమ్ము. యత్కించేదం. అలాటి అపరాధమే కొంచెం చేసి ఉన్నా ఆచిత్తీ. అది తెలిసి గాదు. తెలియని అజ్ఞాన దోషం వల్లనే సుమా. యత్తవ ధర్మా యుయోపిమ - తన్నిమిత్తంగా మీ విషయంలో పాటించవలసిన ధర్మాలు మేము యధావిధిగా పాటించక వదిలేసి ఉండవచ్చు.
మానస్త స్మా దేన సో దేవ రీరిషః - అంత మాత్రం చేత మమ్ము దోషులుగా భావించి వదిలేయకు మహాత్మా. ఏనః అంటే పాపం. తెలియక చేసిన ఆ పాపానికి మమ్ము రాచి రంపాన పెట్టవద్దు. కిత వాసో యద్రిపు ర - కితవాసః అంటే మోసగాళ్లు. మోసగాళ్లమై మేము యత్ - చేయదగిన పని ఏది చేయలేదో నదిని - చేయదగనిది ఏది చేశామో. సత్యం అసలు తెలిసి కూడా మంచి పని చేయటం లేదో నవిద్మ - మాకే మాత్రమూ జ్ఞానం లేదా విషయంలో. కనుక సర్వాస్తా అఘా విష్య శిధిరేవ. ఆ పాపకార్యాల నన్నింటినీ నశింప జేసి మమ్మను గ్రహించు.
Page 104