దేవాన్ భావయ తానేన తేదేవా భావయంతు వః అన్నట్టు మనం ప్రాపంచికమైన పదార్ధాలన్నీ భక్తితో దేవతకు సమర్పిస్తే ఆ దేవత వాటికి మారుగా సుఖశాంతులు మనకు ప్రసాదిస్తుంది. ఇదీ మనకూ దేవతలకూ ఉన్న లావాదేవీ. అహేడ మనో వరుణ కాబట్టి ఓవరుణ దేవా? అహేడమానః నన్ను నిర్లక్ష్యంగా చూడవద్దు. అన్నీ నీకు సమర్పించాను. ఉరు శంస. నీవు గొప్ప కీర్తి ప్రతిష్ఠ లున్న వాడవు. మానః ఆయుః ప్రమోషీః మా ఆయుః ప్రమాణాన్ని దయచేసి తగ్గింవద్దు. బోధి. ఈ మాత్రం నీవు మా విషయం గుర్తుంచుకొంటే చాలు. నూరేండ్ల జీవితాన్ని సంపూర్ణంగా మాకు ప్రసాదించ గలవు. ప్రసాదిస్తే బ్రహ్మ జ్ఞానం గడించి మేము తరించగలం.
ద్యవి ద్యవి - ప్రతి దినమూ మినీ మసి. మేము లోపింప జేసి ఉండవచ్చు. ఏమిటి వరుణ వ్రతం వరుణ దేవా నీ యెడల మేమవలంబించ వలసిన వ్రతాన్ని. దీక్షను. యచ్చిద్ధి ఓ కొంచెం పాటించక పోయినా సరే మేమ పరాధులమే. విశో యధా. నౌకర్ల లాటి వాళ్ళం మేము. నీవు మా కధిపతి వైతే మేము మీకు దాసులం. దాసుని తప్పులు దండంతో సరి అన్నారు. యత్కించేదం వరుణ. అయ్యా వరుణ దేవా దైవ్యే జనే అభిద్రోహం మనుష్యా శ్చరామసి - మానవ మాత్రులం మేము. తెలిసో తెలియకో అపచారాలు చేస్తుంటాము.
Page 103