మంగా నైనా-ఈశ్వరార్పణ బుద్ధితో నైనా- చేసి తీరాలని ఒక ఆసిధారావ్రతాన్ని పాటించకపోతే నేమి.
వాస్తవమే. కర్మ కాండము మాని వేయవచ్చు. కాని అలా మానివేసే అదికారం ఒక్కడికే ఉంది. వాడు పరిపూర్ణ జ్ఞాని. తస్య కార్యమ్ నవిద్యతే అన్నట్టు వాడికిక ఏ కర్మా చరణా అక్కరలేదు. అప్పటికీ శరీర స్థితి మాత్రమైన కర్మ వాడికీ ఉంటుందని చెబుతుంది శాస్త్రం. ఇక మిగతా వాళ్ళ మాట చెప్పే దేముంది.
జ్ఞాని గాక మిగిలిన వాళ్ళు రెండే రెండు జాతులు. ఒకరు కేవలం లౌకి కులు. మరొకరు సాధకులు. వీరిద్దరూ కర్మమానివేయటానికి లేదు. జ్ఞానవాసన కూడా లేక కనీసం దాని కోసం ప్రయత్నం కూడా లేకుండా లౌకికంగా బ్రతికేవాడు. శాస్త్ర విహితమైన కర్మలు మానివేస్తే వాడికది అహితాన్ని ఆపా దిస్తుంది. దానికే ప్రత్య వ్యాయమని పేరు. అటు జ్ఞానమూ లేక ఇటు కర్మాను ష్ఠానమూ లేక ఉభయ భ్రష్టుడవుతాడు.
పోతే ఇక సాధకుడని చెప్పామే వాడు కూడా త్యజించటానికి లేదు కర్మ. ఎందుకంటే వాడింకా సాధకుడే గాని సిద్ధుడు కాడు. సిద్ధి కలిగే దాకా కర్మ చేయవలసిందే. సిద్ది అనేది ఇక్కడ జ్ఞానం. దాన్ని సంపాదించటం కోసమైనా కర్మ చేసి తీరాలి సాధకుడు. అయితే అది కేవలం కర్మకాదు. జ్ఞానం కోసమని చేసే కర్మ. దీనికే కర్మ యోగమని పేరు. ఈశ్వర దృష్టితో చేసే కర్మ కాబట్టి ఇది -దానికి విఘాతం కలగకుండా ఎంత మోతాదులో చేయాలో అంతే చేయవలసి ఉంటుంది. అన్ని కర్మలూ తూచా తప్పకుండా నే నాచరించ లేకపోతినే అని తాపత్రయ పడ నక్కరలేదు. ఒక పెద్ద నదిలో నీళ్ళు తాగితే ఎంతో అంతే ఒక నూతిలో దిగి తాగినా. నూతిలో తాగిన ప్రయోజనం మనకు నదిలోనే కలిసి వస్తుంది. ప్రత్యేకంగా దానిలో పోయి దిగనక్కర లేదు.
అలాగే వేదోక్తమైన కర్మలూ-వాటి ఫలితాలు-ఎన్ని వందలు వేలైనా ఉండ నీయండి. ఆవన్నీ పరమాత్మ తత్త్వ జ్ఞాన మనే వెలుగులో ఆచరించే సాధకుడి కా విజ్ఞాన ఫలంలోనే ఈ కర్మ ఫల మంతా గతార్థమై Included పోతుంది. ఇదుగో ఆ దృష్టితోనైనా-ఆ దృష్టి బాగా అలవడటం కోసమైనా-శాస్త్ర చోదిత మైన కర్మలు సమత్వ బుద్ది వదలకుండా ఆచరించాలి సాధకుడు. అప్పుడే అది సత్త్వ శుద్ధికీ జ్ఞానోత్పత్తికీ చేయూతనిస్తుంది.
Page 88