ఈ స్మరణాన్ని ఏమరకుండా ఉంటే విస్మరణ మనేది ఉండబోదు. విస్మరణ మంటే మరపు. నామ రూపాదికమైన ఈ సంసారం వల్లనే మనకు మరవు. సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చారు మన వేదంతులు. శ్వత్థ మంటే రేపటి దాకా ఉండేది. రేపటికి కూడ ఉండనిదేదో అది అశ్వత్థం. అంటే అంత క్షణ భంగురమయిదన్నమాట ఈ సంసారం.
ఈ సంసార మంటున్నాము మాటవరసకే గాని అసలిది ఎక్కడ ఉందని. ఇదిగో కనిపిస్తున్నది గదా అంటే ఈ కనిపించే రూపంలో లేదిది. ఎందుకంటే ఆదీ అంతమూలేదు దీనికి. ఆద్యంతాలు లేని పదార్థం మధ్యలో మాత్రమెలా ఉంటుంది. ఎలా కనిపిస్తుంది. మనకు రాత్రికాలంలో స్వప్న ప్రపంచం కని పిస్తుంది. పడుకొనే ముందు లేదది. అప్పుడున్నది మన జ్ఞానమే- అలాగే తెల్లవారితే లేదది. అప్పుడున్నదీ మన జ్ఞానమే. పోతే మధ్యలో మాత్రమే దాని వ్యవహారం అది యథార్థమెలా కాగలదు. అద్యంతాలలో జ్ఞానమేగదా అది అంచేత మధ్యలో స్వప్నంగా కనిపించేది కూడా వాస్తవంలో జ్ఞానమే. జ్ఞానమే జ్ఞేయంగా కూడా భాసిస్తున్నది. అదీ చమత్కారం.
అలాగే ప్రస్తుత మీసంసార మొక అశ్వత్థం మాదిరి ఎంత శాఖోపశాఖలుగా విస్తరించినా - ఎంత వేళ్ళు పాతుకొని ఉన్నా ఇదంతా మనకు జ్ఞేయంగా లేదె క్కడా. ఎక్కడా ఎప్పుడూ ఉన్న పదార్థం మన ఆత్మ చైతన్యమే Subjective consciousness. అదే తన శక్తివల్లా - మన అవిద్య వల్లా అనాత్మ జగత్తు రూపాన్ని Objective world ధరించి మనకిలా నిత్యమూ భాసిస్తున్నది.
మరి ఈ నామ రూపాధికాన్ని చూస్తున్నంత వరకూ దాని అసలు రూపాన్ని మనం పట్టుకోలేము. మీదు మిక్కులి అది ఈ నామ రూపాదికంగానే మూస పోసినట్టు కనిపిస్తుంది. మనకు. కాబట్టి మనదృష్టి నీ నామరూపాలనే బురదలో ఎక్కడి కక్కడ దిగబడకుండా పెళ్ళగించుకొని ప్రక్కకు మళ్ళించాలి. దీనికే అసంగమని పేరు. అది ఎలా సాధ్యమన సంశయించబని లేదు. వాటినన్నిటినీ సదాకారంగా చిదాకారంగా భావిస్తూ పోటవమే అసంగం. తన్మూలంగా అవి సద్రూపంలోనే కరిగిపోయి సదాత్మకంగానే సాక్షాత్కరిస్తాయి. కాబట్టి అసంగ మనే తీక్షణమైన పరశ్వథంతో ఒక వృక్షాన్ని నరకినట్టే ఈ సంసార వృక్షాన్ని నరికివేయాలి.
దీన్ని నరకటం వరకే అయితే మరలా ప్రయోజనం లేదు. దీనినుంచి వైదొ లగి దాని నందుకోవాలి సాధకుడు. అది దీని కధిష్ఠానమే కాబట్టి ఇది చూడక
Page 110