#


Index

  మరొకటి కిష్కింధా కాండలో. వాటిలో రామగీత ఎక్కడ ఉందా అని మనం దుర్భిణీ పెట్టుకొని చూస్తేగాని కనిపించదు. చాలా గుప్తంగా ఉంటుంది. కృష్ణుడిలాగా రాముడు హడావుడి చేయడు. అల్పసంతోషి. చెప్పిందే చెబుతూ పోతాడు కృష్ణుడు. అందుకే అంత పెద్దదయింది కృష్ణగీత పరిమాణంలో. ఎంత పెద్దదయినా 18 అధ్యాయాలలోనూ చెప్పిన విషయాలు రెండే. ఒకటి కర్మయోగం మరొకటి జ్ఞానయోగం. అది కూడా పైకి రెండుగా కనిపించినా ఆంతర్యంలో ఒకే ఒక యోగమని తేలుస్తాడు చివరకు. మరి ఈ రామగీత అలా కాదు. మానవ జీవితానికి పట్టుకొన్న సమస్య ఏమిటో దానికి పరిష్కారమేమిటో అన్ని కోణాల నుంచీ చూచి అంతా మూటగట్టి మనకు చాలా క్లుప్తంగా అందిస్తాడు రాముడు. ఇది కొన్ని లక్షల పొటెన్సీతో కూడుకొన్న దివ్యౌషధ మనుకోండి. అలాంటి రామగీత మనమిప్పుడు పాఠం చెప్పుకోబోతున్నాము. బాహ్యార్థంతోపాటు అంతరార్థం కూడా సూచన చేయవలసి ఉంది. అప్పుడే దానికి సమగ్రత.

ఇతి
బుధ జన విధేయః
శ్రీనివాస నామధేయః

Page 9