అయితే సామదానార్ధాలు కూడా అందులో కలిసి ఉన్నందు మూలాన పవిత్రం ప్లవగోత్తమః ఈ వానరోత్తముడు ఉత్తమమైన స్థితినే అందుకొన్నాడు.
ఏమిటది. జిత స్తే న మహాత్మనా స్వర్గః - స్వర్గలోకసుఖాన్నే. అదైనా ఎలాగంటే స్వధర్మస్యచ సంయోగాత్- తనకు విహితమైన ధర్మమేదో అది తూచా తప్పకుండా పాటించాడు. ప్రాణా నపరిరక్షతా - ప్రాణాలను కూడా పణంగా పెట్టాడు. జనరంజకంగా రాజ్యం చేశాడు. వీరోచితంగా ప్రతి వీరులతో పోరాడాడు. కనుకనే స్వర్గః పరిగృహీతశ్చ. వీర స్వర్గ మలంకరించ గలిగాడు.
ఇంతకూ మీరూ నేనూ విచారించవలసిందిది గాదు. ఈశ్వర నియతి తన్ను ఎలా శాసిస్తే అలా జీవించి వెళ్ళిపోయాడు వాలి. తదలం పరి తాపేన- అంచేత ఊరక అతణ్ణి గూర్చి పరితపించకండి. పరితపించినా ప్రయోజనం లేదు. అతనికి రావలసిన గతి ఏదో అది వచ్చేసింది. పాప్తకాల ముపాస్యతాం - ప్రస్తుతం మీరాతని శరీరానికేయే సంస్కారాలు చేయాలో అది శాస్త్రోక్త రీతిలో చేసి మీ ఋణం తీర్చుకోండి. మా భక్తుడు హనుమంతుడు కూడా అదే గదా మీకు చెప్పాడు. అలాగే చేయండి. అంతకన్నా మీరాయనకు చేయగలిగిందేమీ లేదు. ఇదీ రాముని ప్రబోధం.
Page 70