అదే కలనం. కాని ఒక విషయాన్ని మాత్రమది ఆలోచించలేదు. తన కన్నా అతీతంగా ఆలోచించే దొకటున్నది. తాను వ్యష్టి అయితే అది సమష్టి. సమష్టి మనస్సు Cosmic mind ఏదో గాదు. దానికే హిరణ్యగర్భ తత్త్వమని మహత్తని పేరు పెట్టారు. సగుణమైన ఈశ్వర శక్తే అది. క్రియా శక్తి Cosmic Cretative Power.
పరిపూర్ణ జ్ఞాన మన్నప్పుడు దాని శక్తి కూడా పరిపూర్ణమే. అది ఆ జ్ఞానానికన్నా వేరు కాదు మరలా, దానితో అవినాభూతమే Inseperable పరాస్య శక్తిః స్వాభావికీ అని శాస్త్ర వచనం. అయితే శక్తి గనుక అది ఊరక కూచోదు. వివిధైవశ్రూయతే. ఇచ్ఛా జ్ఞాన క్రియా ఫలానుభవ రూపంగా అనేక భంగిమలలో బయటపడి కనిపిస్తుంటుంది. అంతకు ముందు దశ అవ్యక్తమైతే బయటపడ్డ దశ వ్యక్తం. ఈ వ్యక్త దశే సంసారం. రెండూ అదే. ఆ మాయాశక్తి స్వరూపమే. స్వభావమే.
స్వభావంచ సమాసాద్య నకశ్చి దతి వర్తతే స్వభావ మన్నప్పుడది సర్వవ్యాపకం. మన మనస్సూ దీని ఆలోచనలూ దీని సుఖదుః ఖాద్యనుభవాలూ కూడా దాని విలాసమే కావలసి వస్తుంది. పరిమితం కూడా పరిపూర్ణంలో ఒక భావమే గదా. ఎటు వచ్చీ తానా పరిపూర్ణంలో ఒక శకలమేనని తెలియదీ మానవుడి మనస్సుకు. తెలియక దాన్ని దాటి పోవాలని చూస్తుంటుంది. అది వట్టి భ్రమ. తన స్వభావమే అయినప్పుడు స్వభావాన్ని ఎలా దాటిపోగలదు. మరేమిటి మార్గం.
Page 63