#


Index

  నీ విభూతిగా దాన్ని చూస్తే. అలా చూడాలంటే ముందు నీ స్వరూప మేమిటో గుర్తించి తరువాత ఆ దృష్టితో దాన్ని చూడాలి. అలా చూడనంత వరకూ విభూతి కాదది. నీ పాలిటికి సంసారం. సంసార మెప్పుడయిందో జనన మరణాలు తప్పవు.

ఏవం పూర్వైర్గతో మార్గః - పితృ పైతామహో ధ్రువః
తమా పన్నః కధం శోచే ద్యస్యనాస్తి వ్యతిక్రమః - 18

  జనన మరణాదులైన ద్వంద్వాలతో కూడిన ఈ సంసారమనేది వ్యావహారిక సత్యం Relative Truth. నేనూ నాది అనే వ్యవహార మున్నంత వరకే ఇది సత్యం. నాది కూడా నాకు పరాయి కాదు నావిభూతే నా స్వరూపమేనని జ్ఞానముదయిస్తే అది ఇక వ్యావహారికం కాదు. పారమార్ధికమైన సత్యం. Absolute Truth. అంతవరకూ నీవెంత శోకించినా ప్రయోజనం లేదు. పరమార్ధ జ్ఞానం కలగనంత వరకూ ఎంత చింతించి ఏమి సుఖం. నూటికి కోటికే ఒక్కడికో తప్ప నూటికి తొంభయి తొమ్మిది మందికి కలగదా జ్ఞానం కూడా. అలా జ్ఞానం లేకుండా పోయిన వారే ఇంతకు ముందుగా పోయిన మన పితృపితా మహులంతా.

  'ఏవం పూర్వైర్గతో మార్గః పితృపైతామహో ధ్రువః - చాలా వరకూ వారంతా కర్మిష్ఠులు. శాస్త్రోక్తమైన ధర్మమార్గంలో కాలం గడపి పోయిన వారే. తమాపన్నః కధం శోచేత్ అలాటి ధర్మమార్గం కూడా తక్కువది గాదు. ఆత్మలోక ప్రాప్తి లేకపోయినా పుణ్యలోక ప్రాప్తికైనా నోచుకోవచ్చు.

Page 51