#


Index

  తేన తస్మిన్న సామర్థ్యం - ప్రేతస్యా స్త్యనుశోచతః అంచేత ప్రేతస్య చచ్చినవాణ్ణి గూర్చి అనుశోచతః నీవెంత విచారిస్తూ కూచున్నా ప్రయోజనం లేదు. విచారించటం మాత్రమే నీవు చేయగలిగేది. తస్మిన్న సామర్థ్యం వాణ్ణి మరలా వెనక్కు తీసుకురాలేవు. తీసుకురావాలని నీవెంత ఆశపడ్డా ఆరాటపడ్డా అలాటి సామర్థ్యమే మానవుడికీ లేదు. తస్మా దపరిహార్యే ర్థ్యే-నత్వం శోచితుమర్హసి అని కృష్ణ భగవానుడు కూడా ఇదే గదా సెలవిస్తాడు. ఒకటి పోతున్నదంటే అలా పోయే స్వభావముంటేనే అది పోతుంది. అదేదో గాదు. ఈ శరీరమనే ఉపాధి. నామరూపాత్మకమైన ప్రతి ఒక్కటీ ఉపాధే Medium. దేనికిది ఉపాధి. ఆత్మచైతన్యానికి. నామరూపరహితం కాబట్టి అది ఒక్కటే ఉపాధి కానిది. నిరాకారమైన ఆ చైతన్యానికి సాకారమైన ఈ శరీరాదులన్నీ ఉపాధులే. వ్యష్టి చైతన్యానికీ శరీరమూ సమష్టి చైతన్యానికైతే విశ్వశరీరమూ. ఇప్పుడు మార్పన్నా మరణమన్నా ఈ ద్వివిధమైన శరీరానికే. అశరీరమైన ఆత్మకు కాదు.

  కనుక ఇప్పుడు మన సమస్యకు పరిష్కారమేమిటో మనకర్ధ మవుతున్నది. అశరీరమైన ఆ చైతన్యమేనా అసలు స్వరూపమని - దానికి కనిపించే ఈ శరీరాద్యుపాధులన్నీ దాని విభూతే దాని విస్తారమే Expan-sion నని గుర్తించి ఆ భావంలో గట్టిగా నిలబడితే చాలు. దాన్నే జ్ఞానమని జ్ఞాన నిష్ఠ అని పేర్కొంటారు వేదాంతులు. అప్పుడేదీ రావటం లేదు. పోవటం లేదు. స్వరూప విభూతులుగా రెండూ నేననే భావమే ఉన్నప్పుడిక రాకపోకలనే ప్రసక్తి ఏముంది. ఇదీ ఎప్పటికైనా మానవుడు సాధించవలసిన జీవిత పరమార్ధం.

Page 48