#


Index

  పరివర్తమని రామబ్రహ్మ మన్నాడంటే అది ఎంతో సాభిప్రాయమా మాట. పరివర్తమంటే పరిణామం. మార్పు, మార్పే మరణమని ఇంతకు ముందే చెప్పుకొన్నాము. వాల్మీకి మహర్షి నోట వచ్చిన ఈ పరివర్తమనే మాటే మహాభారత కర్త వ్యాస భట్టారకుని నోట కూడా వచ్చింది. యక్ష ప్రశ్నలలో ఒకచోట యక్షుడు లోకంలో వార్త ఏమిటని అడిగితే ధర్మరాజిలా అంటాడు.

అస్మిన్ మహామోహమయే కటాహే
సూర్యాగ్నినా నిత్య సమేధితేన
మాసర్తుదర్వీ పరివర్తనేన
భూతాని కాలః పచతీతి వార్తా

  సంసారమనేది ఒక పెద్ద రాగి కాగనుకొంటే దానికి సూర్య మండలమనే అగ్నిజ్వాల నిత్యమూ క్రింద మండుతుంటే అందులో ఈ ప్రాణులందరినీ పడేసి కాలమనే ఒక పెద్ద వంటవాడు మాసఋతు అయయనాదికమనే ఒక పెద్ద తెడ్డు గరిటె పెట్టి ఆ ప్రాణుల నటూ ఇటూ కలియబెడుతూ పాకం చేస్తున్నాడట. ఇదే వార్త ఇంతకన్నా గొప్ప వార్త ఏమున్నదని జవాబిస్తాడు.

Page 42