#


Index

  వెళ్లినప్పుడిదీ ఒక సత్కార్యంగా భావించి మా వెంకట రామశాస్త్రిగారి ఇంట్లో నలుగురమూ సమావేశమై దీన్ని సాంగోపాంగంగా వివరించటం జరిగింది. అది వారు కాసెట్టు చేశారు కూడా. అది ఒక పుస్తకరూపంగా అచ్చువేస్తే భక్తాదు లందరికీ పంచిపెట్టాలనే కోరిక ఆవిడ మరలా వెలిబుచ్చింది.

  అలాగేనని చెప్పి నేనా కాసెట్టు విజయవాడకు తెచ్చి మా శిష్యురాలు చి||సౌ|| విజయలక్ష్మి చేతికిస్తే దాన్ని కాగితం మీద పెట్టి నాచేతి కిచ్చిందావిడ. అది మరలా నేను అచ్చు వేయించి ఆ కాపీలు సీతాదేవిగారి కందజేస్తే ఆవిడ మీబోటి జిజ్ఞాసువు లందరికీ భగవత్ప్రసాదంగా వీటిని పంచి పెట్టింది. ఇందులో నా ప్రమేయమేమీ లేదు. నేను నిమిత్తమాత్రుణ్ణి. అంతా ఆవిడదే. ఆర్థికంగా హార్దికంగా మా సీతాదేవే శ్రీరామ కైంకర్యాన్ని సాగిస్తూ ఆ మహోత్సవంలో నన్నొక వ్యాఖ్యాతగా మీ అందరినీ శ్రోతలుగా చేసి మనకూ ఆ రామభక్తి రసామృతాన్ని ఈ గ్రంధమనే సువర్ణ కలశంలో నించి పంచి పెడుతున్నది.

ఇతి

రస పాన పరితోషీ

శ్రీనివాస మనీషీ

Page 4