#


Index

ప్రారంభము

  నేనీ రామగీతకు వ్యాఖ్యానం వ్రాసి ఒక పుస్తక రూపంగా ప్రకటించాలని ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే అందులో శ్లోకాలు చాలా గొప్పగా ఉండటం మూలాన నా ఉపన్యాసాలలో అక్కడక్కడా సందర్భోచితంగా ఉదాహరిస్తూ వచ్చేవాణ్ణి. అవి కాసెట్లుగా సీడీలుగా మా శిష్యులందరి చేతులలోకి వచ్చి కర్ణాకర్ణిగా శ్రోతలందరూ వినటం తటస్థించింది.

  అలాటి శ్రోతలలో అగ్రగణ్యురాలు మా సీతాదేవి. ఎవరోగాదావిడ. వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంటు కమిషనరుగా పనిచేసి రిటైరైన విదుషీమణి. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నన్నెంతో కాలం నుంచీ వింటూ వచ్చిన శిష్య శిఖామణి, గొప్ప ప్రజ్ఞావతి. సౌజన్యవతి - సర్వజనహితైషిణి. అన్నిటినీ మించి మంచి దైవభక్తి సంపన్నురాలు.

  ఆవిడ ఈ శ్లోకాలు విని ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడైనా వీటిమీద మాటాడి మీరు వాటి అంతర్యం వివరించి చెబితే బాగుంటుందని కోరింది. ఆవిడ కోరిక కాదనలేక ఇటీవల నేను హైదరాబాదు కార్యక్రమానికి

Page 3