మరి అలాటి స్మృతి జీవితంలో ఎంత శీఘ్రంగా అలవరుచుకొంటే అంత మంచిది. అలా కాక బేపరవాగా ఆదమరచి బ్రతుకూ పోయామను కోండి. మనుష్య జన్మ ఎత్తి ప్రయోజనం లేదు. జంతువులూ పక్షులు కూడా బ్రతుకుతూనే ఉన్నాయి మనతోపాటు, మన గొప్పేమిటి. నందం త్యుదిత ఆదిత్యే - అవి సూర్యోదయమైతే లేచి చురుకుగా అటూ ఇటూ తిరుగు తూంటాయి. ఆహారం కోసం ప్రాకులాడుతుంటాయి. మనం చేస్తున్నదీ అదే నందం త్యస్తమితే రవౌ అలా తిరిగి తిరిగి అలసిపోయి మరలా సూర్యుడెప్పు డస్తమిస్తే అప్పుడు వాటి వాటి నెలవులు చేరి హాయిగా పడుకొని నిద్రపోతుంటాయి. అదే పని మనమూ చేస్తుంటాము ప్రతి రాత్రి కాలమూ.
అంతేగాని ఆత్మనో నావబుధ్యంతే మనుష్యా జీవిత క్షయమ్ - రోజు రోజుకూ తమ జీవితకాలమెలా ఖర్చయి పోతున్నదో అవీ గమనించటం లేదు. మనుష్యులమై పుట్టి మనమూ గుర్తించటం లేదు. వాటికంటే వాసనాజ్ఞానమే Instinct Discrimination గాని వివేచనా జ్ఞానం Reason or Discrimination లేదు. మానవలుమైన మనకేమి రోగం. మనకు వాసనే గాక వివేచనా జ్ఞానం కూడా ఉంది గదా. కనుకనే గదా పురుష మనుష్య అనే పేరు వచ్చింది మనకు. అలాంటప్పుడేది సత్యమో ఏది దాని ఆభాసో విభజించి తెలుసుకొని సత్యాభిముఖంగా పయనించ వచ్చుగదా. సత్యమేవ జయతే అన్నట్టు సత్యమే ఎప్పటికైనా కాపాడుతుంది మనలను. సత్తన్నా సత్యమన్నా ఎప్పటికీ నిలిచి ఉండేదని గదా అర్థం. ఎప్పటికీ ఉన్నదంటే దానికి మరణం లేదని గదా.
Page 39