ఏమిటా ప్రభావమది ఎక్కడ ఉంది. ఎలా సంపాదించాలి. చెబుతూనే ఉన్నా మది ఏదో గాదు ఎక్కడో కాదు. క్రొత్తగా సంపాదించ వలసిందీ గాదు. మన ఆత్మ చైతన్యమే. Self awareness ఎప్పుడూ ఉందది వస్తు సిద్ధంగా సర్వత్రా ఆకాశంలాగా. ఆకాశం మనచుట్టూ ఉన్నా మనలోపలా వెలపలా ఉన్నా మనలో ప్రతి అణువూ వ్యాపించి ఉన్నా మనం దాని స్పృహ లేకుండా ఎలా బ్రతుకుతున్నామో అలాగే ఆ చిదాకాశం Conscious space కూడా మనల నణువణువూ కమ్ముకొని ఉన్నా అందులోనే మనం జీవిస్తున్నా అది మన స్వరూపమే అయినా మనం దాన్ని గుర్తించటం లేదు. మరచిపోయాము. దాని స్పృహ లేదు మనకు. కాని ఆ స్మృతి కలగటాని కెంతో ప్రయత్న మక్కరలేదు. ఎప్పుడు స్మరిస్తే అప్పుడది మనమే. తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర అని గదా కృష్ణగీత. రామగీత కూడా ఇప్పుడదే. ప్రతిక్షణమూ మన అసలు స్వరూపమా చిదాకాశం మనస్మృతి పథంలో ఉంటే చాలు. మనమిక మృత్యుంజయులమే.
నందం త్యుదిత ఆదిత్యే నందం త్యస్తమితే రవౌ
ఆత్మనో నావబుధ్యంతే మనుష్యా జీవిత క్షయమ్ - 11
స్మృతి కోలుపోయావో నీవు బ్రతికి ప్రయోజనం లేదు. స్మృతి తప్పితే అది మృతే. ఒక సూఫీ విద్వాంసుణ్ణి అడిగారట కొందరు. అయ్యా మీకెంత వయస్సని. ఎంతో లేదు నాయనలారా ఏదో రెండు మూడేండ్ల కంటే ఎక్కువ ఉండదన్నాడట ఆయన. అదేమిటండీ గడ్డాలు మీసాలు నరిశాయి మీకు.
Page 37