#


Index

  శ్వేతా శ్చైవ శిరోరుహాః నల్లని వెంట్రుక లున్నట్టుండి తెల్లబడి పోతుంటాయి. జరయా పురుషో జీర్ణః మరి వార్ధక్యం సమీపించే కొద్దీ జీర్ణావస్థకు వస్తుందీ శరీరం. జర అంటేనే అసలు జీర్ణింప జేసేదని అర్థం. 'వ్యాఫ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతీ - ఒక ఈనిన పులిలాగా జర అనేది నిన్నను క్షణమూ బెదిరిస్తూ ఉంటుంది. రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం' అంతేగాదు. ఎన్నో రకరకాల వ్యాధులు నిన్నెప్పుడూ దెబ్బ తీస్తూనే ఉంటాయి. ఆయుః పరి స్రవతి భిన్నఘటా దివాంభః మరి వాటితో పాటు నీ ఆయుస్సు చూస్తామా ఓటి కుండలో నుంచి నీరు కారిపోతున్నట్టు రోజు రోజుకూ క్షీణించి పోతున్నది - అయినా బుద్ధి రావటం లేదీ మానవుల కంటాడు భర్తృహరి.

  మంచిదే. అయితే మరి ఏమి చేసి మనం దీన్ని తప్పించుకోవా లంటారు. కిం హి కృత్వా ప్రభావయేత్తని అడుగుతున్నాడు రామస్వామి భరతుణ్ణి. కాదు. ఆ వేషంలో ఒక సద్గురువు మనబోటి శిష్యులను. ప్రభావయేత్తనే మాటలో ఉన్న దున్నదంతా. మనం బలహీనులమై తల ఒగ్గుతున్నంత వరకూ అది మనమీద దాడి చేస్తూ పోతుంది. ఎప్పుడైతే మనం బలం పుంజుకొని దానిమీద విడుచుకు పడతామో అప్పుడది మనకు దాసోహ మంటుంది. ఇంతకూ దాని ప్రభావం మనమీద నా మన ప్రభావం దానిమీదనా ఆలోచించ పని రాముడి ప్రశ్న. ఏమిటి జవాబు. దాని ప్రభావం పనిచేస్తే అది సమస్యే. పరిష్కారం కాదు. కాబట్టి మన ప్రభావమే దానిమీద పనిచేయాలి.

Page 36