ఒక ఆలోచన పోయి మరొకటి ఉదయిస్తూ ఉన్నప్పుడది మరణించటమే గదా. అలాగే మాటాడుతుంటే మాట మారుతున్నది. శరీరంతో చేసే చేష్టలూ మారుతున్నాయి. అసలీ శరీరమే మారుతున్న దనుక్షణమూ. జీవాణువులు పాతవి నశిస్తూ కొత్త వేర్పడు తుంటాయని గదా వైద్యశాస్త్రం చెబుతున్నది. బాల్యం పోయి యౌవనం యౌవనం పోయి వార్ధక్యం వస్తున్నాయంటే అది మార్పు గాదా మరణం కాదా.
కాగా అవసానంలో అసలీ శరీరమే నిశ్చేష్టమై పడిపోతున్నది కాబట్టి దాన్ని మరణం మరణమని పేర్కొంటున్నాము. అంతకు ముందరిదంతా కానట్టు. అంతేగాదు. సోమయాజి అయిన వాడు యజ్ఞయాగాది కర్మలు చేసి రేపు స్వర్గానికి వెళ్తుతాడని సంతోషించినా ఇక్కడ మరణించే గదా అక్కడికి వెళ్లుతున్నాడు. ఈ శరీరం పోయిగదా మరొక భోగ శరీరం వస్తున్నది వాడికి. మరలా కర్మభూమిలో జన్మించవలసి వస్తున్నదా లేదా. జన్మిస్తే మరొక స్థూల శరీరం ధరిస్తుంటాడు. ధరిస్తే మరలా చచ్చేదాకా ఇదే గదా పరస. జాతస్యహి ధ్రువో మృత్యుర్ద్రువం జన్మ మృతస్యచ అన్నట్టు జన్మమృత్యు పరంపర తప్ప దెవడికైనా. వాడు మామాలు వాడే కావచ్చు. శాస్త్రజ్ఞుడే
Scientist
కావచ్చు. కర్మిష్ఠుడే కావచ్చు Ritualist జన్మించాడంటే మరణించ వలసిందే తప్పదు.
Page 34